News August 21, 2024
ప.గో. అబ్బాయి.. తూ.గో. అమ్మాయితో LOVE.. కత్తితో దాడి
ప.గో. జిల్లా ఆచంట మండలం కోడేరులంకకు చెందిన రమేశ్ తూ.గో. జిల్లా పి.గన్నవరం మండలం L.గన్నవరంలో PMPగా వైద్యం చేస్తున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన వరలక్ష్మిని ప్రేమించాడు. అమ్మాయి తండ్రి రమణకు విషయం చెప్పగా ఒప్పుకోలేదు. దీంతో ఆదివారం వారు ఓ చర్చిలో పెళ్లి చేసుకొని ఇంటికెళ్లారు. విషయం తెలిసిన రమణ మంగళవారం రాత్రి అబ్బాయి ఇంటికెళ్లి కత్తితో దాడి చేసి పారిపోయాడు. రమేష్ ఫిర్యాదుతో కేసు నమోదైంది.
Similar News
News September 12, 2024
పోలవరం: ప్రమాదకరమైన ప్రయాణం
పోలవరం మండలం వింజరం గ్రామం నుంచి గార్ల గొయ్యి వెళ్లే రహదారి పై ఉన్న కల్వర్టు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బుధవారం నాటికి సగం పైనే కొట్టుకుపోయింది. దీంతో నిత్యం ఇదే దారిలో వెళ్లే స్కూలు బస్సులు, ఆర్టీసీ బస్సులు, ఇతర అనేక వాహనాలు ప్రయాణించడం ప్రమాదకరంగా మారింది. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చెయ్యాలని స్థానికులు కోరుతున్నారు.
News September 12, 2024
ప.గో.: ఫీజు చెల్లింపునకు గడువు పెంపు
సార్వత్రిక విద్యాపీఠానికి సంబంధించిన టెన్త్, ఇంటర్మీడియట్ ప్రవేశాలకు ఫీజు చెల్లించడానికి గడువు పొడిగించినట్లు పశ్చిమగోదావరి జిల్లా జిల్లా విద్యాశాఖాధికారిణి నాగమణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించడానికి ఈ నెల 15న, రూ.200 అపరాధ రుసుముతో ఈ నెల 16 నుంచి 25 వరకు గడువు ఉన్నట్లు తెలిపారు.
News September 12, 2024
42 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం
ప.గో.జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు 42.86 హెక్టార్ల విస్తీర్ణంలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్లు ఆశాఖ జిల్లా అధికారి దేవానందకుమార్ బుధవారం తెలిపారు. నరసాపురం, మొగల్తూరు, పెనుగొండ, తాడేపల్లిగూడెం, యలమంచిలి మండలాల్లో 2,862 మంది రైతులకు చెందిన కూరగాయల తోటలు దెబ్బతిన్నాయన్నారు. యలమంచిలి, ఆచంట మండలాల్లోని లంక గ్రామాల్లో 50 హెక్టార్లలో అరటి తోటలు మునిగిపోవడంతో పంట దెబ్బతినే అవకాశం ఉందన్నారు.