News June 29, 2024
ప.గో: అమ్మలకు తప్పని ‘కడుపు కోత’
ప.గో జిల్లా వ్యాప్తంగా కొన్నేళ్లుగా సాధారణ ప్రసవాల సంఖ్య భారీగా తగ్గి.. సిజేరియన్లు 80శాతం పైనే నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. 2023-24లో ప్రవేట్‌లో మొత్తం 11,674 కాన్పులు కాగా.. 1,751 మాత్రమే సాధరణ కాన్పులు నమోదయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో 7,912 కాన్పులు కాగా, వాటిలో సాధారణ-3,568, సిజేరియన్లు-4,344 జరిగినట్లు గుణంకాలు చెబుతున్నాయి. ఆపరేషన్‌కు రూ.80వేలు- రూ.లక్ష వసూలు చేస్తున్నట్లు విమర్శలున్నాయి.
Similar News
News October 13, 2024
ఈనెల 14 నుంచి 20 వరకు గ్రామస్థాయిలో పల్లె పండుగ
ఈనెల 14 నుంచి 20 వరకు ప.గో జిల్లాలో గ్రామ స్థాయిలో పల్లె పండగ పంచాయతీ వారోత్సవాలు జరగనున్నాయి. దీంతో సంబంధిత శాఖల అధికారులు సమన్వయం చేసుకొని విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి పిలుపునిచ్చారు. జిల్లాలో 423 పనులను రూ.51.03 కోట్ల వ్యయంతో చేపట్టనున్నట్లు తెలిపారు. వీటిలో 351 సీసీ రోడ్లు రూ.41.94 కోట్లు, 5 BT రోడ్స్ రూ.2.46 కోట్లు, 67CC డ్రైన్స్ రూ.6.63 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.
News October 13, 2024
మద్యం షాపులు లాటరీ ప్రక్రియకు అంతా సిద్ధం: కలెక్టర్
ప.గో. జిల్లాలో అక్టోబర్ 14వ తేది జరగబోయే మద్యం షాపుల లాటరీ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని మొత్తం 175 షాపులకు 5,627 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. పెదమిరం నిర్మల ఫంక్షన్ హాల్‌లో ఉదయం 8 గంటల నుంచి లాటరీ విధానం మొదలవుతుందని అన్నారు. దరఖాస్తుదారుడు ఐడీ ప్రూఫ్‌తో రావాలన్నారు.
News October 13, 2024
ప.గో జిల్లాలో 183.4 మి.మీ. వర్షపాతం నమోదు
గడచిన 24 గంటల్లో జిల్లాలో కురిసిన వర్షపాతం 183.4 మీ.మీ. అని జిల్లా వాతావరణ శాఖాధికారులు ఆదివారం తెలిపారు. అత్యధికంగా ఆకివీడులో 29.0 మి.మీ, అత్తిలిలో 28.8 మి.మీ, ఇరగవరంలో 22.4 మి.మీ, పెనుగొండలో 16.8 మి.మీ, అత్యల్పంగా గణపవరంలో 2.6 మి.మీ పోడూరులో 3.8 మి.మీ, యలమంచిలిలో 4.4 మి.మీ నమోదు కాగా నరసాపురం, మొగల్తూరు, ఆచంటలో అసలు వర్షపాతం నమోదు కాలేదని అధికారులు తెలిపారు.