News September 4, 2024
ప.గో: అల్పపీడనం రూపంలో ప్రమాదం పొంచి ఉంది: కలెక్టర్

మరో 2 రోజుల్లో అల్పపీడనం రూపంలో ప్రమాదం పొంచి ఉందని జిల్లా కలెక్టర్ నాగరాణి అధికారులను హెచ్చరించారు. బుధవారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. గట్లు బలహీనంగా ఉన్న ప్రదేశాలను గుర్తించి పటిష్ఠ పరచడానికి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఏఈలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలన్నారు.
Similar News
News December 4, 2025
జలజీవన్ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ నాగరాణి

జిల్లాలో జలజీవన్ మిషన్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు సంబంధిత శాఖలు సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో తాగునీటి సరఫరా ప్రాజెక్టు ఏర్పాటు పనులపై సంబంధిత శాఖలతో ఆమె సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు ప్రస్తుత స్థితిగతులను, పురోగతిని గుత్తేదారు సంస్థ ప్రతినిధి, మేఘా కంపెనీ డీజీఎం వాసు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమావేశంలో వివరించారు.
News December 4, 2025
ప.గో: 594 కిలోల గంజాయి ధ్వంసం

పశ్చిమగోదావరి జిల్లాలోని వివిధ స్టేషన్లలో పట్టుబడ్డ గంజాయిని ధ్వంసం చేసినట్టు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. గుంటూరు జిల్లా కొండవీడు పరిధిలోని జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ వద్ద ఈ ప్రక్రియ నిర్వహించామన్నారు. మొత్తం 21 కేసులకు సంబంధించిన 594.844 కిలోల గంజాయిని ధ్వంసం చేసినట్టు ఎస్పీ వెల్లడించారు. ఈ ప్రక్రియకు సహకరించిన సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
News December 4, 2025
ప.గోలో డీడీఓ కార్యాలయాన్ని వర్చువల్గా ప్రారంభించినున్న పవన్

ప.గో. జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన డిటిఓ కార్యాలయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లా నుంచి వర్చువల్గా గురువారం ప్రారంభిస్తారని గ్రామ వార్డు సచివాలయ అభివృద్ధి అధికారి దోసిరెడ్డి తెలిపారు. డి ఎల్డీఓలను, డీడీవోలుగా కూటమి ప్రభుత్వం సంస్కరణలు చేపట్టిందన్నారు. ఇందులో జిల్లాలోని విస్సాకోడేరు, నరసాపురం, తాడేపల్లిగూడెం డి డి ఓ కార్యాలయాలు ప్రారంభిస్తారు అన్నారు.


