News August 22, 2024
ప.గో.: అసభ్యకర ప్రవర్తన.. టీచర్ సస్పెండ్

విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ ఉపాధ్యాయుడిపై కేసు నమోదుచేసినట్లు సమిశ్రగూడెం SI రమేశ్ తెలిపారు. నిడదవోలు మండలం కాటకోటేశ్వరం జడ్పీ హైస్కూల్‌లో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నాగమణి రాజు కొంతకాలంగా విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో కొందరు అతనిపై విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేశారు. ఆ మేరకు విచారణ చేసి సస్పెండ్ చేశారు. HM లలితారమణి ఫిర్యాదుతో కేసు నమోదుచేశారు.
Similar News
News February 15, 2025
పాలకొల్లులో సందడి చేసిన జబర్దస్త్ అప్పారావు

జబర్దస్త్ నటుడు అప్పారావు శనివారం పాలకొల్లులో ఓ వివాహ వేడుకకు హాజరై సందడి చేశారు. జబర్దస్త్, పలు నాటికలతో ఆయన ప్రేక్షకులకు సుపరిచితులు. వరుడి తండ్రి తన స్నేహితుడు కావడంతో ఈ వివాహానికి హాజరైనట్లు అప్పారావు తెలిపారు. ఆయన రాకతో వివాహ వేడుకలో సందడి నెలకొంది. పలువురు సెల్ఫీలు దిగారు.
News February 15, 2025
ప.గో : బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. రోడ్డున పడ్డ కూలీలు

ప.గో జిల్లాలో బర్డ్ ఫ్లూ విజృంభించి కోళ్ల యజమానులకు తీవ్ర నష్టం వాటిల్లుతోన్న విషయం తెలిసిందే. అయితే ముఖ్యంగా జిల్లాలో తణుకులోని వేల్పూరు, ఉంగుటూరులోని బాదంపూడి, పెరవలిలోని కానూరు అగ్రహారం గ్రామాల్లో బర్డ్ ఫ్లూ తీవ్రత అధికంగా చూపింది. దీంతో సుమారు 40 ఫారాలు మూతలు పడగా.. పొట్టకూటికి వచ్చిన 3200 మంది కూలీలు ఉపాధి కోల్పోయి కుటుంబ పోషణ కష్టతరం కానుంది.
News February 15, 2025
దడ పుట్టిస్తున్న ‘జీబీఎస్’

గులియన్ బారే సిండ్రోమ్ ఉమ్మడి గోదావరి జిల్లాలను తాకింది. ఇప్పటివరకు కాకినాడ GGHలో 16 కేసులు, రాజమండ్రి GGHలో ఓ కేసు నమోదైంది. ప.గోకు చెందిన వ్యక్తి ప్రస్తుతం కాకినాడలో చికిత్స పొందుతున్నారు. అయితే భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. కాళ్లు, చేతులు తిమ్మిర్లు, కండరాల నొప్పులు ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలంటున్నారు. వ్యాధి ముదిరిన దశలో అవయవాలు చచ్చుబడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.