News July 11, 2024
ప.గో: ఆన్‌లైన్ సేవల్లో అంతరాయం.. ఆగిన రిజిస్ట్రేషన్లు

ఉమ్మడి ప.గో జిల్లా వ్యాప్తంగా గురువారం రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోయాయి. ఆన్‌లైన్ సేవల్లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ శాఖలో రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. దీంతో క్రయ, విక్రయదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. గురువారం మంచి రోజు రావడంతో పెద్ద ఎత్తున క్రయ విక్రయాలు జరుగుతుంటాయి. శుక్రవారం సెంటిమెంట్‌తో పాటు శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో ఇబ్బందులు తప్పేలాలేవు.
Similar News
News February 14, 2025
భీమవరం: పదో తరగతి పరీక్షలపై కలెక్టర్ సమీక్ష

భీమవరం కలెక్టరేట్ లో పదో తరగతి పరీక్షల ఏర్పాట్ల పై సంబంధిత అధికారులతో కలెక్టర్ నాగరాణి సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మార్చి 17 నుంచి 31 వరకు 10వ తరగతి రెగ్యులర్ వారికి, 17 నుంచి మార్చి 28 వరకు ఓపెన్ స్కూల్స్ విద్యార్ధులకు పరీక్షలు జరుగుతాన్నారు. పరీక్షలు ఉదయం 9.30 నుంచి 12.45 వరకు జరుగుతాయన్నారు. రెగ్యులర్, ప్రైవేటు కలిపి జిల్లాలో 128 కేంద్రాల్లో 24,393 మంది విద్యార్ధులు హాజరవుతారన్నారు.
News February 14, 2025
ప.గో : నామినేషన్లు విత్ డ్రా చేసుకుంది వీరే..

గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 35 మంది పోటీలో నిలిచారు. మొత్తం 54 మంది నామినేషన్ వేయగా అధికారులు 11 మంది నామినేషన్లను తిరస్కరించారు. అందులో 8 మంది విత్ డ్రా చేసుకున్నారు. 35 మంది బరిలో నిలిచారు. పిల్లంగొళ్ల లీలా నగేశ్, విజయలక్ష్మీ, కవల నాగేశ్వరరావు, పచ్చిగోళ్ల దుర్గారావు, పేరాబత్తుల సత్యవాణి, గండుమోలు బాలాజీ, సత్తి రాజు స్వామి, కోండ్రు చక్రపాణి విత్ డ్రా చేసుకున్నారు.
News February 14, 2025
యలమంచిలి : లారీ ఢీకొని మహిళ మృతి

లారీ ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన యలమంచిలి ప్రధాన రహదారిపై గురువారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం.. తాడిగరువుతోటకు చెందిన విజయ నడుచుకుని వెళ్తుండగా.. కొబ్బరిలోడు లారీ ఆమెను ఢీకొంది. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమె ముగ్గురు కుమార్తెలకు వివాహమైంది. భర్త ఇటీవల మృతి చెందినట్లు సమాచారం.