News June 5, 2024
ప.గో.: ఆరుగురికి 50వేల ప్లస్ మెజారిటీ.. మీ కామెంట్..?

ప.గో. జిల్లాలోని 15 స్థానాల్లో గెలుపొందిన కూటమి MLAలలో ఒక్క పోలవరం మినహాయిస్తే.. అన్నీ చోట్ల 25 వేలకు పైగా మెజారిటీలు సాధించారు. మరోవైపు ఆరుగురు MLAలు 50 వేలకు పైగా మెజారిటీ సాధించారు. మరి ఇంత భారీ మెజారిటీలకు కారణం టీడీపీ- జనసేన- బీజేపీ జత కట్టడమే అని లోకల్‌గా టాక్ నడుస్తోంది.
– మీరేమంటారు..?
Similar News
News February 25, 2026
ఏకీకృత కుటుంబ సర్వేను పూర్తి చేయాలి: కలెక్టర్

యలమంచిలి మండలంలో ఏకీకృత కుటుంబ సర్వే ప్రక్రియను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. బుధవారం యలమంచిలి తహశీల్దార్ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించారు. మండలంలో సాగుతున్న ఏకీకృత కుటుంబ సర్వే, ఈ-కేవైసీ, పీ-4 కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. సర్వేలో ఎలాంటి పొరపాట్లు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలన్నారు.
News February 25, 2026
కాళ్ల: కలెక్టర్‌ను కలిసిన వరి పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు

కలెక్టర్ నాగరాణిని భారతీయ వరి పరిశోధన సంస్థ శాస్త్రవేత్తల బృందం బుధవారం మర్యాదపూర్వకంగా కలిసింది. పెదఅమిరం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో డా. మానస, డా. జాగృతి రోహిత్, డా. రాఘవేంద్ర, డా. సతీష్ చవాన్ పాల్గొన్నారు. భవిష్యత్తులో జిల్లాలో వరి సాగుపై రైతులకు మరిన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టే అంశంపై చర్చించారు. రైతుల సంక్షేమం కోసం వినూత్న ప్రయోగాలు చేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు.
News February 25, 2026
ప.గో: ఒక రోజు ముందే పింఛన్ల పంపిణీ

ప.గో జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను ఈ నెల 28నే పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. మార్చి 1 ఆదివారం కావడంతో, ప్రభుత్వం ఒకరోజు ముందుగానే పంపిణీకి ఉత్తర్వులు జారీ చేసిందని వివరించారు. జిల్లాలోని 2,22,982 మంది లబ్ధిదారులకు రూ. 96.39 కోట్లను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. శనివారం ఉదయమే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు అందజేయాలని అధికారులను ఆదేశించారు.


