News March 12, 2025

ప.గో: ఆరు యూనిట్లు ఇసుక ధర ఎంతో తెలుసా..!

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇసుకకు డిమాండ్ తగ్గి ధరలు దిగోచ్చాయి. యూనిట్ ఇసుక రూ.10 వేలకే దొరుకుతోంది. జిల్లాలో భవన నిర్మాణాలు ఒక్కసారిగా మందగించడంతో ధర అందుబాటులో ఉన్నప్పటకి డిమాండ్ లేకపోవడంతో లారీ యాజామానులు గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు ప్రభుత్వ అభివృద్ధి పనులు ప్రస్తుతం నత్తనడకన సాగుతున్నాయి. అయినప్పటికి అదనంగా ఛార్జీలు వస్తూలు చేస్తున్నారని కనీసం రూ.2 వేలు మిగలడం లేదని వాపోతున్నారు.

Similar News

News December 12, 2025

భీమవరం: లింక్ క్లిక్.. సినిమా స్టైల్‌లో నగదు మాయం

image

భీమవరంలోని శివరావుపేటకు చెందిన శ్రీరామదాసు సైబర్ మోసానికి గురయ్యాడు. ఫోన్‌కు వచ్చిన లింక్‌పై క్లిక్ చేయడంతో బ్యాంక్ అకౌంట్ నుంచి సినిమాలో చూపించే తరహాలో రూ.1,70,400 ఐదు దఫాలుగా వెంట వెంటనే కట్ అయిపోయాయి. దీంతో బాధితుడు వెంటనే సైబర్ క్రైమ్ నంబర్ 1930కు ఫిర్యాదు చేశాడు. భీమవరం టూటౌన్ సీఐ కాళీచరణ్ అకౌంట్లలో ఉన్న రూ.90 వేలు ఫ్రీజ్ చేయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News December 12, 2025

ప.గో : ఇకపై వాహన చలానాలు ఇలా..!

image

వాహనదారులు ట్రాఫిక్‌ ఉల్లంఘనలు చేసే సమయంలో ట్రాఫిక్‌ పోలీసులు విధించే చలానాలు ఇకపై ఫోన్‌పే ద్వారా చెల్లించాలని తణుకు పట్టణ సీఐ ఎన్‌.కొండయ్య కోరారు. ఫోన్‌పేలో కొత్తగా ఈ ఛాలాన్‌ అనే టాబ్‌ ద్వారా వాహనం నంబర్ ఎంటర్‌ చేస్తే చలానాలు కనిపిస్తాయన్నారు. వాటిని తక్షణమే ఒక సెకన్‌లో చెల్లించి ట్రాఫిక్‌ పోలీసులకు సహకరించాలని సీఐ కొండయ్య కోరారు.

News December 11, 2025

జిల్లాలో 1315 పోలియో బూత్‌లు ఏర్పాటు: కలెక్టర్

image

జిల్లాలో ఈనెల 21న పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించాలని కలెక్టర్ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో 0-5 సంవత్సరాల వయసు కలిగిన 1,87,204 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయవలసి ఉందన్నారు. దీని కోసం 1,315 పోలియో బూత్‌లను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణకు 5,520 మంది ఉద్యోగులు విధులకు హాజరుకావాలని కోరారు.