News July 16, 2024

ప.గో.: ఆశాజనకంగా రూప్‌చంద్‌ చేప ధరలు

image

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో రూప్‌చంద్‌, శీలావతి చేపల రేట్లు పెరగడంతో చేపల మార్కెట్లు కళకళలాడుతున్నాయి. సాధారణంగా కేజీ రూప్‌చంద్‌ చేపల పెంపకానికి రైతుకు అన్నీ కలిపి రూ.90 నుంచి రూ.95 వరకు ఖర్చవుతుంది. మార్కెట్‌లో ధర పెరగడంతో కేజీ చేప ధర రూ.114 పలుకుతోంది. దీంతో రూ.15 నుంచి రూ.20 గిట్టుబాటు అవుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News December 1, 2025

జిల్లాలో రోడ్లు అభివృద్ధికి రూ.37.70 కోట్లు నిధులు: కలెక్టర్

image

ప.గో. జిల్లాలోని రోడ్ల అభివృద్ధికి, కోపల్లె బ్రిడ్జి నిర్మాణానికి రూ.37.70 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేయడం జరిగిందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. రాష్ట్ర రహదారులు, జిల్లాలోని ప్రధాన రహదారులు అభివృద్ధికి ఈ నిధులను ఖర్చు చేయనున్నట్లు ఆమె సోమవారం తెలిపారు. ఉండి నియోజకవర్గంలో కోపల్లె బ్రిడ్జి నిర్మాణానికి రూ.12 కోట్లు నిధులు విడుదల చేసినట్లు ఆమె వెల్లడించారు.

News December 1, 2025

ప.గో.: పోలీస్ శాఖ PGRSకు 13 అర్జీలు

image

పాలకోడేరు మండలం గొల్లలకోడేరులోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 13 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ తెలిపారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, సంబంధిత పోలీస్ స్టేషన్లకు పంపి, సమస్యల పరిష్కారానికి తక్షణం చర్యలు తీసుకుంటామని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు.

News December 1, 2025

తణుకులో గుర్తుతెలియని మృతదేహం కలకలం

image

తణుకు పట్టణంలో సోమవారం గుర్తు తెలియని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. రాష్ట్రపతి రోడ్డులోని కోర్టు సమీపంలో సుమారు 50 ఏళ్లు వయసు కలిగిన మృతదేహం ఉన్నట్లు స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు స్థానికంగా యాచకం చేస్తుంటాడని స్థానికులు చెబుతున్నారు. మృతదేహాన్ని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.