News March 26, 2025

ప.గో: ఆ గ్రామాలను దత్తత తీసుకోనున్న పవన్..!

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ కుటుంబ మూలాలున్న మొగల్తూరు, పెనుగొండ గ్రామాల అభివృద్ధికి ఆలోచన చేస్తున్నారు. ఈ నెల 28వ తేదీ ఉదయం మొగల్తూరు, సాయంత్రం పెనుగొండలో గ్రామ అభివృద్ధి సభలు నిర్వహించి ఆర్జీలను స్వీకరించాలని నిర్ణయించారు. ఉప ముఖ్యమంత్రి పేషీ అధికారులు ఈ సభలకి హాజరయ్యి ఆయా గ్రామాలకు కావల్సిన అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనపై చర్చించి అర్జీలు స్వీకరిచి వాటిపై దృష్టిపెడతారు.

Similar News

News April 1, 2025

ముఖ్యమంత్రితో కేంద్ర మంత్రి వర్మ చర్చలు

image

వైజాగ్ స్టీల్ ప్లాంట్ బలోపేతానికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నాయని కేంద్ర మంత్రి వర్మ అన్నారు. భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సోమవారం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో చర్చలు జరిపారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ బలోపేతానికి ప్యాకేజీని మంజూరు చేసిన తర్వాత తదనంతర పరిణామాలపైనా చర్చించారు.

News March 31, 2025

మహిళా ఖైదీ సూసైడ్.. ఇద్దరు సస్పెండ్

image

ఏలూరు జిల్లా జైల్లో నిన్న వాష్‌రూమ్‌లో జీలుగుమిల్లి(M) ఆకులగూడేనికి చెందిన మహిళా ఖైదీ శాంతకుమారి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె సూసైడ్‌పై విచారణ చేపట్టిన డీఎస్పీ శ్రావణ్‌కుమార్, ఆర్డీవో అంబరీష్ జైలును పరిశీలించారు. హెడ్‌వార్డర్ వరలక్ష్మి, వార్డర్ నాగమణిలు నిర్లక్ష్యంగా విధులు నిర్వహించడతోనే ఆమె సూసైడ్‌కు ఆస్కారం ఏర్పడిందనే ఆరోపణలు రావడంతో వారిని సస్పెండ్ చేశారు.

News March 31, 2025

జీలుగుమిల్లి: అయ్యో పాపం.. ఆ చిన్నారుల పరిస్థితి ఏమిటి?

image

ఉమ్మడి ప.గో జిల్లా జీలుగుమిల్లి(M) తాటియాకులగూడెంలో ఇటీవల హత్యకు గురైన గంధం బోసు హత్య కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న బోసు భార్య శాంతకుమారి ఆదివారం జైల్లో ఉరివేసుకుని మృతిచెందారు. దీంతో వారి పిల్లలు చెర్రీ(8), ఆరాధ్య(7) అనాథలయ్యారు. ఇప్పుడు ఆ చిన్నారుల పరిస్థితి ఏమిటో తెలియట్లేదు. తల్లిదండ్రులను పోగొట్టుకున్న చిన్నారుల పరిస్థితిని చూసిన స్థానికులు అయ్యో పాపం వీరికి ఎంత కష్టమొచ్చిందో అని అంటున్నారు.

error: Content is protected !!