News February 12, 2026

ప.గో: ఆ 40 మందిలో మీ MLA ఉన్నారా?

image

NDA ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సుమారు 40 మంది ఎమ్మెల్యేల పనితీరు ఆశాజనకంగా లేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ జాబితాలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నట్లు సమాచారం. పనితీరు మార్చుకోని వారితో నేరుగా మాట్లాడతానని సీఎం వెల్లడించారు. మరి మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఆ 40 మందిలో మీ ఎమ్మెల్యే ఉన్నారని అనుకుంటున్నారా.. అయితే కామెంట్ చేయండి.

Similar News

News March 9, 2026

బ్లాక్ మార్కెట్లో సిలిండర్ ధర ₹1500

image

ఇరాన్ యుద్ధం కారణంగా భారత్‌లో LPG సిలిండర్లకు డిమాండ్ పెరిగింది. కొన్ని చోట్ల (UP) బ్లాక్ మార్కెట్‌లో ధర ₹1,500కు చేరింది. యుద్ధం నేపథ్యంలో మార్చి 7న డొమెస్టిక్ సిలిండర్ ధర ₹60 పెరగడంతో ప్రజలు భయంతో పానిక్ బయింగ్ మొదలుపెట్టారు. దీనివల్ల గ్యాస్ ఏజెన్సీల ముందు భారీ క్యూలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని అరికట్టేందుకు ప్రభుత్వం 2 సిలిండర్ బుకింగ్‌ల మధ్య 25 రోజుల గ్యాప్ ఉండాలనే రూల్ తీసుకొచ్చింది.

News March 9, 2026

HPV టీకా కార్యక్రమాన్ని ప్రారంభించిన పార్వతీపురం కలెక్టర్

image

పార్వతిపురం కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో HPV టీకా కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. మహిళల ఆరోగ్య రక్షణే ప్రధాన ధ్యేయంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ముఖ్యంగా మహిళల్లో వచ్చే గర్భాశయ క్యాన్సర్‌ను నివారించే దిశగా ప్రభుత్వం టీకా పంపిణీ కార్యక్రమం చేపట్టిందన్నారు. బహిరంగ మార్కెట్లో టీకా ధర రూ.4,000 పైగా ఉన్నప్పటికీ ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందన్నారు.

News March 9, 2026

మహిళలూ HYD వెళ్తున్నారా… అయితే త్వరలో మీకోసం ఓ యాప్

image

TG: విద్య, ఉపాధి కోసం ఇతర ప్రాంతాల నుంచి HYDకి వచ్చే మహిళల కోసం ఓ యాప్‌ను GOVT తెస్తోంది. వారికి వసతి, భద్రత కల్పించే లక్ష్యంతో దీన్ని రూపొందిస్తోంది. యాప్ ద్వారా GOVT, గుర్తింపు పొందిన వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లలోని రూములను ముందుగా బుక్ చేసుకోవచ్చు. హాస్టళ్లలో CCTV కెమెరాలు, సెక్యూరిటీతో పటిష్ఠ ఏర్పాట్లుంటాయి. TNలో అమల్లో ఉన్న ఇలాంటి యాప్‌ను పరిశీలించిన అధికారులు త్వరలో ఇక్కడా ప్రారంభించనున్నారు.