News June 7, 2024

ప.గో.: ఆ MLA రాష్ట్రంలో 6వ స్థానం.. జిల్లాలో TOP

image

తణుకు నియోజకవర్గంలో కూటమికి భారీగా ఓటింగ్ నమోదైంది. ఇక్కడ మొత్తం ఓటర్లు 2,34,575 ఉండగా.. 1,93,046 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా 82.16 శాతం పోలింగ్ నమోదైంది. కాగా TDPకి 66.39 శాతం ఓట్లు రాగా.. వైసీపీ 29.52 శాతానికి పరిమితమైంది. వెరసి ఇక్కడ గెలుపొందిన కూటమి MLA అభ్యర్థి ఆరిమిల్లి మెజారిటీ పరంగా రాష్ట్రంలోనే 6వ స్థానంలో జిల్లాలో మొదటిస్థానంలో నిలిచారు. 72121 ఓట్ల మెజారిటీ వచ్చిన విషయం తెలిసిందే.

Similar News

News November 12, 2025

ఒక్కొక్క టీమ్ రోజుకు 25 ఎకరాలు రీ సర్వే చేయాలి: జేసీ

image

జిల్లాలో ఉండి, వీరవాసరం, నరసాపురం, యలమంచిలి మండలాల్లో ఒక్కొక్క టీం రోజుకు 25 ఎకరాలు రీ సర్వే చేసేలా ఆర్డీవోలు మండల సర్వేలు తహసీల్దార్లు పర్యవేక్షించాలని జేసి రాహుల్ అన్నారు. మంగళవారం జేసి ఛాంబర్లో అధికారులతో జరిగిన సమీక్షలో మాట్లాడారు. రైతులకు నోటీసులిచ్చి డాక్యుమెంట్లు పరిశీలించే సర్వే పూర్తి చేయాలన్నారు. రీ సర్వే ఫేస్ 2లో జున్నూరు, మార్టేరు గ్రామాలు రికార్డును సమర్పించాలని ఆదేశించారు.

News November 11, 2025

రేపు పీఎమ్ ఆవాస్ యోజన గృహప్రవేశాలకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

రేపు జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహప్రవేశాలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయని కలెక్టర్ నాగరాణి తెలిపారు. జిల్లాకు కేటాయించిన 6,770 గృహాలకు 6,600 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకుని గృహ ప్రవేశాలు ఇప్పటికే పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఇళ్ల నిర్మాణాలు పూర్తయి సిద్ధంగా ఉన్న100 గృహల ప్రవేశాలు అన్ని నియోజకవర్గాల్లో రేపు నిర్వహించనున్నట్లు తెలిపారు.

News November 11, 2025

దొంగలను పట్టించిన పసుపు రంగు చెప్పులు

image

భీమవరం నుంచి హైదరాబాద్‌‌కు వెళ్లి చోరీలు చేస్తున్న నలుగురు దొంగలు పోలీసులకు పట్టుబడ్డారు. 2 రాష్ట్రాల్లో వీరిపై 12 కేసులు నమోదవ్వగా సౌత్ ఈస్ట్ జోన్, టాస్క్ ఫోర్స్ పోలీసులు అప్రమత్తమై చోరీ ప్రాంతాల్లోని సీసీ, ఫింగర్ ప్రింట్‌లను పరిశీలించగా..ఓ చోరుడి పసుపు రంగు చెప్పులు విభిన్నంగా కనిపించాయి. దీంతో నిఘా పెంచి నాదర్‌గుల్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నామని నిన్న మీడియాకు వెల్లడించారు.