News March 21, 2024
ప.గో: ఇంగ్లీష్ పరీక్షకు 665 మంది విద్యార్థులు డుమ్మా!
పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నేడు నిర్వహించిన SSC పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్‌వి రమణ తెలిపారు. ఇంగ్లీష్ పరీక్షకు 21,238 మందికి గాను 20,573 మంది హాజరయ్యారని, 665 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు.
Similar News
News February 5, 2025
ప.గో: నులిపురుగుల నిర్మూలన గోడపత్రిక ఆవిష్కరణ
ఈనెల 10న నిర్వహించే జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మంగళవారం భీమవరం జిల్లా కలెక్టరేట్ ఛాంబర్లో జాతీయ నులిపురుగుల నిర్మూలన గోడపత్రికను జిల్లా కలెక్టరు చేతుల మీదుగా ఆవిష్కరించారు. జిల్లాలో ఫిబ్రవరి 10న అంగన్వాడి, పాఠశాలలు, కళాశాలల పిల్లలకు ఆల్బెండజోల్ 400 ఎంజి మాత్రలు తప్పనిసరిగా ఇప్పించాలన్నారు.
News February 4, 2025
ఈనెల 6న పీడీఎస్ బియ్యం వేలం..
జిల్లాలో నిల్వ ఉన్న 48.330 మెట్రిక్ టన్నుల పీడీఎస్ రైస్‌ను ఈనెల 6న బహిరంగ వేలం వేయనున్నట్లు జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మంగళవారం తెలిపారు. 6ఎ కేసుల్లో సీజ్ చేసిన ప్రజా పంపిణీ బియ్యాన్ని ఉండి యం.యల్.యస్ పాయింట్‌లో నిల్వ ఉంచామన్నారు. విచారణ అనంతరం 6ఎ కేసులు ముగియడంతో సీజ్ చేసిన బియ్యాన్ని కేజీ రూ.20 ధర నిర్ణయించి వేలం వేస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన వారు వేలంలో పాల్గొనవచ్చన్నారు.
News February 4, 2025
ప.గో: న్యూఢిల్లీ ప్రతినిధులతో కలెక్టర్ సమీక్ష
పీఎం లంక వద్ద సముద్రం కోత నిరోధానికి డిలైట్ కంపెనీ ప్రాజెక్టు పనులను వెంటనే చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు. సోమవారం భీమవరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ లో న్యూఢిల్లీలోని డిలైట్ ప్రతినిధులతో వర్చువల్‌గా సమావేశమై పీఎం లంక ప్రాజెక్టుపై సమీక్షించారు. పీఎం లంక వద్ద సముద్రపు కోత గురికావడంతో దానికి అడ్డుకట్ట వేసే ప్రాజెక్టుకు ఒప్పందం కుదిరిందన్నారు.