News January 30, 2025

ప.గో. ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు..జిల్లా రెవెన్యూ అధికారి 

image

ఇంటర్ ప్రాక్టికల్, పబ్లిక్ పరీక్షలకు పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి మొగిలి వెంకటేశ్వర్లు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం భీమవరం కలెక్టరేట్ డిఆర్ఓ ఛాంబర్‌లో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్, పబ్లిక్ పరీక్షలు నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్, మార్చి1 నుంచి మార్చి 20 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. 

Similar News

News April 19, 2026

ప.గో జిల్లాలో ఎండు గడ్డికి పెరిగిన డిమాండ్

image

జిల్లాలో ప్రధానంగా డెల్టా, కొల్లేరు తీరప్రాంతాల్లో ఆక్వా చెరువులు విస్తీర్ణం పెరిగిన నేపథ్యంలో వరి సాగు విస్తీర్ణం క్రమంగా తగ్గుతూ వస్తోంది. దీంతో పశుగ్రాసం, ముఖ్యంగా ఎండు గడ్డి కొరత పశు పోషకులను వెంటాడుతుంది. పశువుల పెంపకం కోసం ప్రస్తుత దాళ్వా మాసూళ్లు జరుగుతున్న క్రమంలో ధాన్యానికన్నా ముందుగానే ఎండు గడ్డిని ఒబ్బిడి చేసుకుంటున్నారు. ట్రాక్టర్ ఎండు గడ్డి ధర రూ.8-10వేలు పలుకుతోంది.

News April 19, 2026

భీమవరంలో చికెన్ ధర ఎంతంటే?

image

భీమవరంలో ఆదివారం మాంసం ధరలు ఆకాశాన్నంటాయి. బాయిలర్ కోడి కిలో రూ.300, ఫారం కోడి రూ.260కు చేరగా.. మటన్ ధర ఏకంగా రూ.1000 పలుకుతోంది. గత రెండు రోజులతో పోలిస్తే చికెన్ ధరలు రూ.20 నుంచి రూ.40 వరకు పెరిగాయని వ్యాపారులు తెలిపారు. చేపలు రకాన్ని బట్టి రూ.150 నుంచి రూ.180 వరకు విక్రయిస్తున్నారు. ధరలు భారీగా పెరగడంతో సామాన్య వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి

News April 19, 2026

ప.గో: హాట్ టాపిక్‌.. అసలు సూత్రధారులు ఎవరు?

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరుతో నకిలీ సిఫార్సు లేఖలు తయారుచేసి ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసిన వ్యవహారం జిల్లాలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జనసేన శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేయగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు సైతం ఫిర్యాదు చేయడం కొసమెరుపు. ఇప్పటికే ఈ వ్యవహారం జనసేన పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు సమాచారం.