News February 3, 2025
ప.గో: ఇంటర్ యువతిపై లెక్చరర్ అత్యాచారం

ఇంటర్ అమ్మాయిపై లెక్చరర్ అత్యాచారం చేసిన ఘటన ఇది. కొవ్వూరుకు చెందిన 17 ఏళ్ల అమ్మాయి రాజమండ్రిలో ఇంటర్ చదువుతోంది. అదే కాలేజీలో తిరుపతికి చెందిన వినయ్‌వర్ధన్ జూనియర్ లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. గతనెల 28న ఆమెను విజయవాడ తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతపురం, ఇతర ప్రాంతాల్లో తిరిగి భీమవరం వచ్చారు. తర్వాత అమ్మాయిని ఇంటికి పంపేయగా.. ఆమె తల్లి ఫిర్యాదుతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.
Similar News
News March 14, 2025
చిత్తూరు: శక్తి టీంలను వెంటనే ఏర్పాటు చేయాలి

జిల్లా అంతట శక్తి టీంలను వెంటనే ఏర్పాటు చేయాలని ఎస్పీ మణికంఠ ఆదేశించారు. సిబ్బందితో నేర సమీక్ష సమావేశంలో గురువారం ఆయన మాట్లాడారు. అసాంఘిక కార్యకలాపాలపై డ్రోన్లతో నిఘా పెంచాలని సూచించారు. సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలన్నారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ప్రజలను చైతన్య పరచాలన్నారు. అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపాలన్నారు.
News March 14, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News March 14, 2025
బోరుగడ్డకు 14 రోజుల రిమాండ్

AP: రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్‌కు కోర్టు రిమాండ్ విధించింది. జైలులో లొంగిపోయిన ఆయనను పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకున్న చిలకలపూడి పోలీసులు అదనపు జిల్లా జడ్జి ముందు హాజరుపరిచారు. చిలకలపూడి పీఎస్‌లో నమోదైన కేసుల్లో అనిల్‌కు ఈ నెల 27 వరకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు.