News February 15, 2025

ప.గో: ఇల్లు కట్టుకోవాలనే లక్ష్యాన్ని నెరవేర్చాలి..కలెక్టర్ 

image

ఇల్లు కట్టుకోవాలనే ప్రతి ఒక్కరి లక్ష్యాన్ని నెరవేర్చేలా గృహ నిర్మాణ శాఖ అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్‌లో గృహ నిర్మాణ శాఖ అధికారులతో పీఎంఏవై-ఎన్టీఆర్ కాలనీ గృహ నిర్మాణాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గృహ నిర్మాణాల లక్ష్య సాధనలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉండేలా కృషి చేయాలన్నారు.

Similar News

News November 27, 2025

కంబోడియా సూత్రధారి.. ప.గోలో 13 మంది అరెస్టు

image

భీమవరానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి శర్మ నుంచి రూ.78 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్ల గుట్టును పోలీసులు రట్టు చేశారు. కంబోడియాకు చెందిన ప్రధాన సూత్రధారి రహేత్ జె నయన్ సహకారంతో.. ‘కార్డ్ డీల్’ పద్ధతిలో ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఈ కేసులో మొత్తం 13 మందిని అరెస్టు చేయగా, ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి: కలెక్టర్ నాగరాణి

image

ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. బుధవారం పాలకోడేరు మండలం కుముదవల్లి రైతు సేవా కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా తేమ శాతం లెక్కింపు, గోనె సంచుల పంపిణీ రిజిస్టర్లను పరిశీలించారు. రైతులు వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు అవగాహన చేసుకోవాలని ఆమె సూచించారు. జేడీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.