News June 18, 2024
ప.గో.: ఈ నెల 21 నుంచి పలు రైళ్లు దారి మళ్లింపు

విజయవాడ రైల్వే డివిజన్లోని పలుచోట్ల ట్రాక్పనులు చేపడుతున్నందున ఈ నెల 21 నుంచి జులై నెలాఖరు వరకు పలు రైళ్లను దారి మళ్లించనున్నట్లు అధికారులు తెలిపారు. కొన్నిరైళ్లను రామవరప్పాడు వరకు నడపనున్నట్లు చెప్పారు. రోజూ మధ్యాహ్నం 3 గంటలకు నరసాపురం నుంచి విజయవాడ వెళ్లే డెమో రైలును రామవరప్పాడు వరకే నడపుతామన్నారు. ఆ రైలు తిరిగి రాత్రి 8 గంటలకు రామవరప్పాడులో బయల్దేరి అర్ధరాత్రి 12గంటలకు నరసాపురం చేరుతుందన్నారు
Similar News
News November 3, 2025
భీమవరం: నేడు యథావిధిగా పీజీఆర్ఎస్

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రారంభించిన మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) యథావిధిగా జరుగుతుందని ఆమె చెప్పారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పీజీఆర్ఎస్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
News November 2, 2025
ఉండి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ఉండి మండలం నక్కరాజగుంట వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఉండి నుంచి ఆకివీడు వెళుతున్న గంధం రాఘవులు అనే వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News November 2, 2025
బియ్యం బస్తా మోసిన ఎమ్మెల్యే నాయకర్

తుఫాన్ ప్రభావిత ప్రాంతమైన వేములదీవిలో శనివారం నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది. ఈ క్రమంలో 50 కేజీల బియ్యం బస్తా, ఇతర సరుకులను ఇంటికి తీసుకెళ్లలేక ఇబ్బంది పడుతున్న ఒక దివ్యాంగురాలిని ఎమ్మెల్యే నాయకర్ గమనించారు. వెంటనే ఆయనే స్వయంగా బియ్యం బస్తాతో సహా సరుకులన్నింటినీ తన భుజాలపై మోసుకుని, ఆమె త్రిచక్ర వాహనం వరకూ చేర్చారు. ఆపదలో ఉన్న బాధితురాలికి ఎమ్మెల్యే చేసిన సాయం ఆదర్శంగా నిలిచింది.


