News July 27, 2024
ప.గో: ఉద్ధృతంగానే గోదావరి.. అధికారుల అలర్ట్

భద్రాచలం వద్ద శనివారం 4PMకు నీటిమట్టం 53 అడుగులు ఉండగా అధికారులు 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీంతో ఉమ్మడి ప.గో జిల్లాలో అధికారులు అలర్ట్ అయ్యారు. కలెక్టర్ నాగరాణి వరద ప్రభావంపై సమీక్ష నిర్వహించారు. లంక గ్రామాల ప్రజలకు భోజనం, వసతి, తాగునీటి సమస్యలు లేకుండా చూడాలన్నారు. మూగజీవాలకు నష్టం జరగకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ఇబ్బందులున్న చోట వరద బాధితులు పునరావాస కేంద్రాలకు వెళ్లాలన్నారు.
Similar News
News November 28, 2025
బాధితులకు రూ.1.85 కోట్లు అందజేత: కలెక్టర్

జిల్లాలో ఎస్సీ, ఎస్టీలపై జరిగిన దాడుల కేసుల విచారణ వేగవంతం చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. గురువారం జరిగిన విజిలెన్స్ కమిటీ సమావేశంలో డిసెంబర్ 24 నుంచి మే 25 వరకు బాధితులకు రూ.1.85 కోట్ల పరిహారం చెల్లించామని తెలిపారు. అట్రాసిటీ కేసులలో ఎఫ్ఐఆర్, చార్జిషీట్ నమోదులో జాప్యం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
News November 28, 2025
భీమవరంలో మాక్ అసెంబ్లీ

మాక్ అసెంబ్లీ నిర్వహణ ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుందని హెచ్.ఎం. కె. కృష్ణకుమారి అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భీమవరంలోని ఝాన్సీలక్ష్మీబాయి మున్సిపల్ హైస్కూల్లో విద్యార్థినులు గురువారం మాక్ అసెంబ్లీ నిర్వహించారు. రాజ్యాంగం తయారు చేయడానికి ముందు, తర్వాత ప్రజల జీవన విధానం ఎలా ఉండేదో తెలిపే స్కిట్‌ను కూడా పాఠశాల విద్యార్థినులు ప్రదర్శించారు.
News November 27, 2025
కంబోడియా సూత్రధారి.. ప.గోలో 13 మంది అరెస్టు

భీమవరానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి శర్మ నుంచి రూ.78 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్ల గుట్టును పోలీసులు రట్టు చేశారు. కంబోడియాకు చెందిన ప్రధాన సూత్రధారి రహేత్ జె నయన్ సహకారంతో.. ‘కార్డ్ డీల్’ పద్ధతిలో ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఈ కేసులో మొత్తం 13 మందిని అరెస్టు చేయగా, ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.


