News January 3, 2025
ప.గో: ఎకో-సెన్సిటివ్ జోన్ ఖరారుపై గ్రామసభలు

ఆకివీడు, ఉండి, పెంటపాడు, గణపవరం, కాళ్ల మండలాలలో ఎకో-సెన్సిటివ్ జోన్ ఖరారుపై జనవరి 6న గ్రామ సభలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. కొల్లేరు అభయారణ్యం చుట్టు ప్రక్కల ఎకో-సెన్సిటివ్ జోన్ ఖరారు చేయడంపై స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ఈ సమావేశాలు ఉంటాయన్నారు. ఆయా మండలాలకు సంబంధించి కొల్లేరు పరిధిలోని ప్రజలు గ్రామసభలకు హాజరై అభిప్రాయాలను తెలియజేయాలని కోరారు.
Similar News
News April 23, 2025
పాలకోడేరు : ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్.. ఐదుగురికి అస్వస్థత

పాలకోడేరు మండలం మోగల్లు వశిష్ట మెరైన్స్ ఆక్వా పరిశ్రమలో అమ్మోనియా గ్యాస్ లీకై ప్రమాదం సంభవించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఒడిశాకు చెందిన ఐదుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో భీమవరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు.
News April 23, 2025
ప.గో : టెన్త్ రిజల్ట్స్..17,695 మంది పాస్

పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ప.గో.జిల్లాలో మొత్తం 21,539 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 17,695 మంది పాసయ్యారు. 10,924 మంది బాలురు రాయగా 8,612 మంది పాసయ్యారు.10,615 మంది బాలికలు పరీక్ష రాయగా 9,083 మంది పాసయ్యారు. 82.15 పాస్ పర్సంటేజ్ తో పశ్చిమగోదావరి జిల్లా 16 వ స్థానంలో నిలిచింది.
News April 23, 2025
తాడేపల్లిగూడెం : ఆటోల దొంగ అరెస్ట్

తాడేపల్లిగూడెంలో ఆటోలు దొంగిలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని,రూ. 14 లక్షల విలువైన 7 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. వరుసగా ఆటోలు చోరీకి గురవుతున్నాయని కేసులు నమోదు అవుతుండడంతో ప్రత్యేక నిఘా పెట్టినట్లు డీఎస్పీ ఎం. విశ్వనాథ్ తెలిపారు. మామిడితోటకు చెందిన వెంకటేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారించగా విషయం బయటపడిందన్నారు. పార్క్ చేసి ఉన్న ఆటోలను తెల్లారేసరికి మాయం చేసేవాడని తెలిపారు.