News January 3, 2025
ప.గో: ఎకో-సెన్సిటివ్ జోన్ ఖరారుపై గ్రామసభలు
ఆకివీడు, ఉండి, పెంటపాడు, గణపవరం, కాళ్ల మండలాలలో ఎకో-సెన్సిటివ్ జోన్ ఖరారుపై జనవరి 6న గ్రామ సభలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. కొల్లేరు అభయారణ్యం చుట్టు ప్రక్కల ఎకో-సెన్సిటివ్ జోన్ ఖరారు చేయడంపై స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ఈ సమావేశాలు ఉంటాయన్నారు. ఆయా మండలాలకు సంబంధించి కొల్లేరు పరిధిలోని ప్రజలు గ్రామసభలకు హాజరై అభిప్రాయాలను తెలియజేయాలని కోరారు.
Similar News
News January 16, 2025
భీమవరంలో కిడ్నాప్ కలకలం
భీమవరం పట్టణంలోని మెంటేవారి తోటకి చెందిన విశ్వనాథుని వెంకట సత్యనారాయణ గురువారం కిడ్నాప్ అయ్యారు. సత్యనారాయణ తమ బంధువులను టౌన్ రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కించడానికి వచ్చి బయటికు వచ్చారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆయనను వారి కారులో ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. కిడ్నాప్‌కి ఆర్థిక లావాదేవీలే కారణం అని పలువురు అంటున్నారు. ఘటనపై భీమవరం రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News January 16, 2025
ప.గో జిల్లాను పచ్చగా నిర్మించుకుందాం: కలెక్టర్ నాగరాణి
పశ్చిమ గోదావరి జిల్లాలో ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్ నాగరాణి గురువారం అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తొలి దశలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, టీ గ్లాసులను నిషేధిస్తున్నామన్నారు. కలెక్టరేట్ నుంచే ఈ కార్యక్రమం అమలు జరుగుతుందన్నారు. జిల్లాను పచ్చగా నిర్మించుకుందామని, అందరూ సహకరించాలని, ఆంక్షలు మీరితే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News January 16, 2025
తాడేపల్లిగూడెం: అసలు ఎవరీ రత్తయ్య..?
సంక్రాంతి నేపథ్యంలో ఉభయగోదావరి జిల్లాల్లో వేలల్లో పందేలు జరిగాయి. వందల కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఈసారి తాడేపల్లిగూడెంలో ఏకంగా రూ.1.25 కోట్ల పందెం జరిగింది. కోడిపందేల్లో పేరు మోసిన రత్తయ్య పుంజు, గుడివాడ ప్రభాకర్ పుంజు మధ్య రసవత్తరంగా పందెం జరిగింది. ఎంతో పేరు మోసిన రత్తయ్య పుంజు ఓడిపోవడంతో అందరూ ఖంగుతిన్నారు. అసలు ఎవరీ రత్తయ్య అని ఆరా తీయగా.. ఆయనది లింగపాలెం మండలం రంగాపురం అని తేలింది.