News August 8, 2024

ప.గో.: ఎన్ఎంఎంఎస్ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం

image

ప్రస్తుత విద్యా సంవత్సరంలో జరిగే జాతీయ ప్రతిభా ఉపకార వేతన పరీక్ష (ఎన్ఎంఎంఎస్)కు విద్యార్థులు నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా డీఈవో జి. నాగమణి ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబరు 8న జరిగే ఈ పరీక్షకు 8వ తరగతి విద్యార్థులు అర్హులన్నారు. సెప్టెంబరు 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

Similar News

News September 18, 2024

మంత్రి మండలి సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. రాష్ట్రంలోని సమస్యల పరిష్కారంపై మాట్లాడారు. అదేవిధంగా వివిధ శాఖలకు చెందిన మంత్రులు, అధికారులు, ఈ మంత్రి మండలి సమావేశంలో పాల్గొన్నారు.

News September 18, 2024

సీఎం చంద్రబాబుతో సమావేశం.. హాజరైన మంత్రి నిమ్మల

image

చెల్లించకుండా పెండింగ్ లో ఉన్న నీరు చెట్టు బిల్లుల విడుదలకు సంబంధించి మంగళవారం సీఎం చంద్ర‌బాబుతో మంత్రులు ప‌య్యావుల కేశ‌వ్, నిమ్మ‌ల రామానాయుడు, అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ కలిసి చర్చించారు. చర్చల అనంతరం ద‌శ‌ల వారీగా నీరు చెట్టు బిల్లులను విడుద‌ల చేయాల‌ని ఆర్థిక శాఖ‌ను ముఖ్య‌మంత్రి చంద్రబాబు ఆదేశించినట్లు తెలిపారు.

News September 18, 2024

ప.గో జిల్లాలో పొగాకు మళ్లీ ఆల్ టైం రికార్డ్ ధర

image

ఉమ్మడి జిల్లాలోని ఎన్‌ఎల్‌ఎస్‌ ఏరియా పరిధిలోని పొగాకు ధర రికార్డు బద్దలు కొట్టింది. మంగళవారం జంగారెడ్డిగూడెం-1, జంగారెడ్డిగూడెం-2, కొయ్యలగూడెం వేలం కేంద్రాల్లో అత్యధికంగా రూ.408 నమోదయ్యింది. దేవరపల్లి వేలం కేంద్రంలో రూ.400, గోపాలపురంలో రూ.399 ధర పలికింది. మొత్తం ఐదు వేలం కేంద్రాల్లో 6,669 బేళ్లు రైతులు అమ్మకానికి తీసుకురాగా, వీటిలో 4,444 బేళ్లు అమ్ముడైనట్లు రైతులు పేర్కొన్నారు.