News June 1, 2024
ప.గో.: ఎన్నికల ఫలితాలు క్లారిటీ వచ్చినట్లేనా..? మీ కామెంట్..?

ఓట్ల పండగ ముగిసినప్పటి నుంచి ఊరు.. వాడా ఎక్కడ చూసినా ఎన్నికల ఫలితాలపైనే అందరి దృష్టీ నెలకొంది. చాణక్య స్ట్రాటజీస్ సంస్థ ఉమ్మడి జిల్లాలో కూటమికి 12 వస్తాయని, కేకే సంస్థ టీడీపీ-9, జనసేన-6 గెలుస్తాయని ఫలితాలు విడుదల చేశాయి. కాగా తుది ఫలితం కాకపోయినప్పటికీ ఓ అంచనా వచ్చేందుకు దోహదపడుతోంది. ఏదేమైనప్పటికీ ఫలితాల కోసం మరో 3 రోజులు వెయిట్ చేయాల్సిందే.
– ఇంతకీ మీ అంచనా ఏంటి..?
Similar News
News November 17, 2025
నేడు యథావిధిగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ

ప్రజా సమస్యల పరిష్కారానికి మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను నేడు కలెక్టరేట్లో నిర్వహిస్తున్నట్లు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వాటి ఫిర్యాదులను నమోదు చేసుకోవడానికి Meekosam. ap.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చాన్నారు.
News November 16, 2025
ఫోన్ కోసం అలిగి.. బాలుడు అదృశ్యం: ఎస్ఐ

సెల్ ఫోన్ చూడవద్దని తల్లి మందలించడంతో ఓ బాలుడు (11) అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన నరసాపురంలో చోటుచేసుకుంది. ఈ నెల 14న బాలుడు ఫోన్ పగులగొట్టి వెళ్లిపోయాడని, తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై జయలక్ష్మి తెలిపారు. బాలుడి ఆచూకీ కోసం పట్టణం, పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఆధారంగా ముమ్మరంగా గాలిస్తున్నట్లు పోలీసులు వివరించారు.
News November 16, 2025
పెదఅమీరం: తొలి జీతం.. గ్రామదేవతకు అందజేత

కాళ్ల మండలం పెదఅమిరం గ్రామ దేవత శ్రీ పల్లాలమ్మ దేవాలయ అభివృద్ధికి ఉపాధ్యాయుడు బూరాడ వెంకటకృష్ణ శనివారం తన మొదటి జీతాన్ని అందజేశారు. మెగాడీఎస్సీ 2025 లో స్కూల్ అసిస్టెంట్(మాథ్స్) ఉద్యోగం సాధించిన వెంకటకృష్ణ తన తొలి జీతం మొత్తం రూ.50,099 లను ఆలయ అభివృద్ధి కమిటీ పెద్ద కోరా రామ్మూర్తికి అందజేశారు. ఆయనను పలువురు అభినందించారు.


