News November 22, 2024
ప.గో: ఎమ్మెల్సీ అభ్యర్థులు ఐదుగురే.!
ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులు చివరకు ఐదుగురే మిగిలారు. ఉపఎన్నికల్లో ఒక నామినేషన్ ఉపసంహరణ అనంతరం ఐదుగురు అభ్యర్థులు పోటీలో నిలిచినట్లు కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ గురువారం తెలిపారు. 1.గంధం నారాయణరావు, 2.దీపక్ పులుగు, 3.నాగేశ్వరరావు కవల, 4.నామన వెంకట లక్ష్మీ, 5.బొర్రా గోపీ మూర్తి అభ్యర్థులు బరిలో నిలిచినట్లు చెప్పారు. 5న పోలింగ్, 9న ఓట్ల లెక్కింపు జరుగుతుందని వివరించారు.
Similar News
News December 8, 2024
దత్తత పిల్లలకు హాని జరిగితే చర్యలు: కలెక్టర్
దత్తత పిల్లలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైనే ఉంటుందని, దత్తత పిల్లలకు ఎటువంటి హాని జరిగిన శాఖపరమైన చర్యలు తీసుకుంటామని ఏలూరు కలెక్టర్ వెట్రి సెల్వి హెచ్చరించారు. శనివారం తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన పిల్లలు లేని తల్లిదండ్రులకు 7 నెలలు, 13 ఏళ్ల బాలికను కలెక్టర్ చేతుల మీదుగా దత్తత ఇచ్చారు. పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పించాలని దత్తత తీసుకున్న వారికి సూచించారు.
News December 7, 2024
రవాణా శాఖ తనిఖీల్లో 832 కేసులు నమోదు
ఏలూరు జిల్లాలో కొనసాగుతున్న రవాణా శాఖ ప్రత్యేక తనిఖీల్లో భాగంగా 832 కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఉప రవాణా కమిషనరు షేక్ కరీమ్ తెలిపారు. డిసెంబరు ఒకటవ తేదీ నుంచి ఈరోజు వరకు వివిధ రకాల వాహనాలపై పలు ఉల్లంఘనలకు గాను 832 కేసులు నమోదు చేసి 14 లక్షల 92 వేల రూపాయల అపరాధ రుసుము విధించామన్నారు. విద్యా సంస్థల బస్సులపై 23 కేసులు నమోదు చేశామన్నారు.
News December 7, 2024
చింతలపూడి: తల్లి మృతితో కుమారుడు సూసైడ్
చింతలపూడి(M) వెంకటాద్రి గూడెంలో కృష్ణ బాబు(31) అనే వ్యక్తి శుక్రవారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన కుటుంబీకులు చింతలపూడి ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శనివారం చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. తల్లి మృతితో కృష్ణబాబు 2 నెలల నుంచి మనస్తాపంతో ఉన్నాడన్నారు.