News May 27, 2024

ప.గో.: ఏఈఓల సంఘ ఉమ్మడి జిల్లాధ్యక్షుడిగా రాంబాబు

image

తాడేపల్లిగూడెం పట్టణంలోని వ్యవసాయ పరీక్ష కేంద్రంలో ఆదివారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా నెక్కంటి రాంబాబు, MDR.శివప్రసాద్ ఎన్నికయ్యారు. వీరితో పాటు ఇతర కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు వేణుమాధవరావు, రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ, నాయకులు పాల్గొన్నారు.

Similar News

News December 13, 2025

జాతీయ వినియోగదారుల దినోత్సవ సంబరాలపై సమీక్ష చేపట్టిన జేసీ

image

భీమవరం కలెక్టరేట్‌లో శుక్రవారం జాతీయ వినియోగదారుల దినోత్సవం సంబరాలు 2025 ఏర్పాట్లపై జిల్లా జాయింట్ కలెక్టర్ టీ రాహుల్ కుమార్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ..డిసెంబర్ 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలో వినియోగదారుల హక్కులపై విస్తృత అవగాహన కల్పించే వారోత్సవాలు నిర్వహించాలని అన్నారు.

News December 12, 2025

సామాజిక చైతన్యానికి బాలోత్సవాలు: కలెక్టర్

image

బాలోత్సవాలు విద్యార్థుల్లో సామాజిక చైతన్యానికి సామాజిక ప్రగతికి ఎంతగానో దోహదపడతాయని కలెక్టర్ నాగరాణి అన్నారు. భీమవరం ఎస్ఆర్ కెఆర్ కళాశాలలో రెండు రోజుల పాటు జరిగే బాలోత్సవాలను ఆమె ప్రారంభించారు. విద్యార్థులకు చిన్నతనం నుంచి ఆటలు పాటలు ఉంటే చెడు మార్గం వైపు వెళ్లరని అన్నారు. ఎమ్మెల్సీ గోపీమూర్తి మాట్లాడుతూ..సమాజాన్ని పట్టిపీడిస్తున్న పలు రకాల వ్యసనాలతో విద్యార్థి యువత పెడదోవ పడుతున్నారని అన్నారు.