News May 27, 2024
ప.గో.: ఏఈఓల సంఘ ఉమ్మడి జిల్లాధ్యక్షుడిగా రాంబాబు

తాడేపల్లిగూడెం పట్టణంలోని వ్యవసాయ పరీక్ష కేంద్రంలో ఆదివారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా నెక్కంటి రాంబాబు, MDR.శివప్రసాద్ ఎన్నికయ్యారు. వీరితో పాటు ఇతర కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు వేణుమాధవరావు, రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ, నాయకులు పాల్గొన్నారు.
Similar News
News March 13, 2026
పర్యాటకాభివృద్ధిపై దృష్టి: కలెక్టర్

సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన గురువారం జరిగిన రెండో రోజు కలెక్టర్ల సదస్సులో కలెక్టర్ సి.నాగరాణి పాల్గొన్నారు. పర్యాటకాభివృద్ధిపై చర్చ సందర్భంగా.. జిల్లాలో ప్రభుత్వ భూముల కొరతను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. హోటళ్ల నిర్మాణానికి అనువుగా రెండు చోట్ల ఆర్‌అండ్‌బీ స్థలాలను గుర్తించి, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్‌కు ప్రతిపాదనలు పంపినట్లు ఆమె ఈ సమావేశంలో వివరించారు.
News March 12, 2026
ప.గో: డ్రోన్ల వినియోగం భేష్.. కలెక్టర్‌కు సీఎం ప్రశంస

కలెక్టర్ల సమావేశంలో ప.గో కలెక్టర్ నాగరాణి పనితీరుపై ముఖ్యమంత్రి ప్రశంసలు కురిపించారు. జిల్లాలో 45 డ్రోన్లను వ్యవసాయ సాగుతో పాటు, విద్యుత్తు లైన్ల నిర్మాణంలో పోల్ టు పోల్ వైర్లను అమర్చేందుకు ఉపయోగిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. దీనివల్ల తక్కువ సమయంలో పనులు పూర్తవుతున్నాయని తెలిపారు. ఈ వినూత్న ప్రయోగాన్ని గతంలో ఎన్నడూ వినలేదని పేర్కొంటూ సీఎం ఆమెను ప్రత్యేకంగా అభినందించారు.
News March 12, 2026
భీమవరం: హాల్ టికెట్ చూపిస్తే ఉచిత ప్రయాణం

ఈ నెల 16 నుంచి 28 వరకు జరిగే పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. భీమవరం, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో విద్యార్థులు హాల్ టికెట్ చూపించి పల్లె వెలుగు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని అధికారి గిరిధర్ కుమార్ తెలిపారు. ఇంటి నుంచి పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి ఈ సదుపాయం ఎంతో దోహదపడనుంది.


