News September 9, 2024

ప.గో, ఏలూరు జిల్లాల్లో రేపటి ‘మీకోసం’ ప్రోగ్రాం రద్దు

image

ప.గో, ఏలూరు జిల్లాల్లో వర్షాలు, వరదల కారణంగా సోమవారం జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ ‘మీకోసం’ కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు కలెక్టర్లు నాగరాణి, వెట్రిసెల్వి ఓ ప్రకటనలో తెలిపారు. మండల, డివిజన్ స్థాయిలో జరగాల్సిన ‘మీ కోసం’ ప్రోగ్రాములను కూడా రద్దు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలంతా గమనించాలని కోరారు.

Similar News

News October 15, 2024

ఏలూరు జిల్లాలో 12 మంది మహిళలకు వైన్ షాపులు

image

ఏలూరు జిల్లాలో సోమవారం జరిగిన మద్యం దుకాణాల లాటరీ విధానంలో పలువురు మహిళలు దుకాణాలను దక్కించుకున్నారు. జిల్లాలో 144 మద్యం దుకాణాలకు 5,499 మంది టెండర్లు దాఖలు చేయగా, 144 మద్యం షాపులకు లక్కీడిప్‌ ద్వారా 144 మందిని ఎంపిక చేసినట్లు కలెక్టర్‌ చెప్పారు. అయితే వీరిలో 12 మంది మహిళలు మద్యం దుకాణాలను లాటరీ విధానంలో కైవసం చేసుకున్నారు.

News October 14, 2024

ఏలూరు ఎస్పీ పరిష్కార వేదికకు 45 ఫిర్యాదులు

image

ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి 45 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. వాటిని సమగ్రంగా విచారించి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

News October 14, 2024

నరసాపురం: మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దు

image

సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని నరసాపురం ఆర్డీవో దాసి రాజు మత్స్యకారులకు సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో సముద్ర అలలు ఎగసి పడుతాయని, మళ్లీ ప్రకటన వెలువడే వరకూ చేపల వేటకు వెళ్లొద్దని పేర్కొన్నారు. అధికారుల సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని వారికి హెచ్చరికలు జారీ చేశారు.