News September 15, 2024
ప.గో.: ఒక్కరోజులో 2466 కేసులు రాజీ
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో శనివారం లోక్‌అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. కాగా రాత్రి 8 గంటల వరకు జరిగిన ఈ లోక్ అదాలత్‌లో 2466 కేసులు రాజీచేశామని న్యాయవాదులు తెలిపారు. పరిష్కరించిన కేసుల్లో 2149 క్రిమినల్, 193 సివిల్, 124 వాహన ప్రమాద బీమా కేసులు ఉన్నాయన్నారు. ఇవి కాకుండా 130 ప్రీలిటికేషన్ కేసులను పరిష్కరించినట్లు వివరించారు.
Similar News
News October 12, 2024
ద్వారకా తిరుమల వెంకన్నకు బ్రహ్మోత్సవాలు
ద్వారకాతిరుమల అఖిలాండ కోటి బ్రహ్మాండనాయుడి వైభవాన్ని చాటే శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 13 నుంచి ప్రారంభం కానున్నాయి. చిన్నతిరుపతిగా పేరొందిన ద్వారకాతిరుమల దివ్య క్షేత్రంలో స్వామివారికి ఏటా రెండు పర్యాయాలు(వైశాఖ, ఆశ్వీయుజ మాసాల్లో)ఈ బ్రహ్మోత్సవాలు వైఖానస ఆగమోక్తంగా జరపడం సంప్రదాయంగా వస్తోంది. ఈనెల 13 నుంచి 20 వరకు ఈ ఉత్సవాలను నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు.
News October 12, 2024
మన ఏలూరు జిల్లాకు రెండో స్థానం
ఏలూరు జిల్లాలో మద్యం షాపులకు దరఖాస్తుల గడువు శుక్రవారంతో ముగిసింది. మద్యం షాపులకు దరఖాస్తులు వెల్లువెత్తడంతో రాష్ట్రంలోనే ఏలూరు జిల్లా రెండో స్థానంలో నిలిచింది. మొత్తం5,339 దరఖాస్తులు అందినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది.ఈ నెల 14న లాటరీ పద్ధతిలో షాపులను కేటాయించనున్నారు. దీంతో దరఖాస్తు దారులంతా టెన్షన్ తో ఎదురుచూస్తున్నారు.
News October 12, 2024
నల్లజర్ల: పెళ్లి పేరుతో మోసం.. యువకుడిపై కేసు నమోదు
నల్లజర్లలోని శ్రీనివాసరావు కాలనీలో ఉంటున్న సురేశ్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి కథనం.. అదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి గర్భవతిని చేశాడు. కుల పెద్దల సమక్షంలో యువతి తల్లిదండ్రులు యువకుడిని నిలదీయడంతో తనకు సంబంధం లేదని ముఖం చాటేసాడు. యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసామని సీఐ శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు.