News April 7, 2024
ప.గో.: ఒక్కో ఎన్నికల్లో ఒక్కో పార్టీ విజయం.. ఈ సారి..?

చింతలపూడిలో రాజకీయం ఆసక్తిగా మారింది. ఇక్కడ వైసీపీ సిట్టింగ్ MLA ఎలీజాను కాదని కొత్తఅభ్యర్థి కంభం విజయరాజుకు ఆ పార్టీ అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. కూటమి నుంచి సైతం టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిని కాదని కొత్త అభ్యర్థి సొంగా రోషన్‌ను ప్రకటించింది. అయితే నియోజకవర్గ ఓటర్లు 2009, 14, 19 ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్, టీడీపీ, వైసీపీలకు అధికారం కట్టబెడుతూ వచ్చారు. మరి ఈ సారి ఎవరికి అవకాశమిస్తారో చూడాలి.
Similar News
News November 23, 2025
భీమవరం: ఘనంగా సత్యసాయి శత జయంతి ఉత్సవాలు

భీమవరంలో సత్యసాయి మందిరంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొని, బాబా చిత్రపటానికి నివాళులర్పించారు. మానవసేవే మాధవసేవగా బాబా అందించిన సేవలు చిరస్మరణీయమని వారు కొనియాడారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే ఐదు సూత్రాలను అందరూ పాటించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
News November 23, 2025
భీమవరం: 29న మెగా జాబ్ మేళా

భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల వేదికగా ఈ నెల 29న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్లో గోడపత్రికను ఆమె ఆవిష్కరించారు. ఈ డ్రైవ్‌లో 28కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని, సుమారు 3000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని అర్హులైన యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News November 23, 2025
ప.గో: అర్హులందరికీ ఇళ్ల స్థలాలు

అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు అందించే దిశగా చర్యలు వేగవంతం చేయాలని జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. శనివారం భీమవరంలో అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు. పాత లేఅవుట్లలోని ఖాళీ ప్లాట్లను గుర్తించి వీఆర్వో లాగిన్‌లో అప్డేట్ చేయాలన్నారు. పెనుగొండ, పెనుమంట్ర, అత్తిలి, పోడూరు మండలాల్లో డేటా ఎంట్రీ ప్రారంభమైందని, మిగిలిన చోట్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాన్నారు.


