News May 12, 2024

ప.గో.: ఓటింగ్ శాతం పెంచుదాం

image

ప.గో. జిల్లాలో గత 2 అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే.. పోలింగ్ శాతం కొంతమేర తగ్గింది. 2014 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో 82.25 శాతం పోలింగ్ జరగగా.. 2019 ఎన్నికల్లో 82.19 శాతం పోలింగ్ నమోదైంది. కాగా ఈ ఎన్నికల్లో మరింత పెంచేలా ఓటర్లుగా మనం ముందుకెళ్దాం.
– ఇంతకీ గత 2 ఎన్నికల్లో మీరు ఓటు వేశారా..?

Similar News

News January 1, 2026

పండుగలా పాస్‌ పుస్తకాల పంపిణీ చేపట్టాలి: జేసీ

image

జిల్లాలో రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్‌ పుస్తకాల పంపిణీని పండుగ వాతావరణంలో చేపట్టాలని జేసీ టి.రాహుల్‌ కుమార్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం భీమవరంలో ఆర్డీవోలు, తహశీల్దార్లతో నిర్వహించిన గూగుల్‌ మీట్‌లో ఆయన మాట్లాడారు. జనవరి 2 నుంచి 9 వరకు ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని, రెవెన్యూ క్లినిక్‌ల పనితీరుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

News December 31, 2025

జనవరి 5న జిల్లాలో గ్రామసభలు: కలెక్టర్

image

వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజీవికా మిషన్, గ్రామీణ్ పథకంపై జనవరి 5న జిల్లాలో అన్ని గ్రామాలలో గ్రామసభలు నిర్వహించాలి కలెక్టర్ నాగరాణి అన్నారు. బుధవారం కలెక్టరేట్లో గ్రామీణ్ పథకంపై పనులపై సమీక్షించారు. వీబీజీ రాంజీ పథకంలో భాగంగా 100 రోజుల నుంచి 125 రోజులు పని దినాలు కల్పించడం జరిగిందన్నారు. 60 శాతం కేంద్ర ప్రభుత్వం 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు.

News December 31, 2025

పాలకోడేరు: పెన్షన్లు పంపిణీ చేసిన కలెక్టర్

image

కుముదువల్లి పంచాయతీ చినపేటలో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ చేశారు. కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. కలెక్టర్ కుమారుడు చదలవాడ భరత్ వృద్ధులకు పండ్లను పంపిణీ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అన్నారు.