News May 12, 2024
ప.గో: ఓట్ల పండగ.. RTC ప్రత్యేక బస్సు సర్వీసులు

రేపే పోలింగ్.. ఏదేళ్లకోసారి వచ్చే ఈ ఓట్ల పండగలో భాగమయ్యేందుకు ప.గో జిల్లాకు HYD, ఇతర నగరాల నుంచి దాదాపు 60వేల మంది వస్తున్నట్లు అంచనా. దీంతో RTC ప్రత్యేక బస్సులు నడుపుతోంది. HYD నుంచి సాధారణ రోజుల్లో 14 బస్సులు నడవగా.. ఈనెల 9 నుంచి 12 వరకు మరో 13 సర్వీసులు (భీమవరం-4, నరసాపురం-3, తణుకు-3, తాడేపల్లిగూడెం-3) ఏర్పాటు చేశారు. తిరిగి వెళ్లేందుకు 13, 14 తేదీల్లో 11 సర్వీసులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది.
Similar News
News October 26, 2025
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: RDO

మెంథా తుపాను ప్రభావంతో ఈ నెల 27, 28న భారీ వర్షాలు, బలమైన గాలులు సంభవించనున్నట్టు నరసాపురం RDO దాసి రాజు శనివారం సూచించారు. అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. అవసరమైతే తీర, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సన్నద్ధం చేస్తున్నామన్నారు. సముద్రంలోకి చేపలవేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచించారు.
News October 25, 2025
జిల్లా అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు: కలెక్టర్

జిల్లా అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు చేశామని, 24/7 అధికారులు అందుబాటులో ఉండాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. కలెక్టరేట్, రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశామన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్లో రెవిన్యూ డివిజనల్ అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. తుపాన్ ప్రభావంపై ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు.
News October 25, 2025
కోపల్లెలో విద్యుత్ షాక్తో బాలుడు మృతి

విద్యుత్ షాక్తో బాలుడు మృతి చెందిన ఘటన కాళ్ల మండలం కోపల్లెలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కె.షాలేంరాజు(15) స్నేహితులతో కలిసి బ్యానర్ కడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ఫ్రేమ్ విద్యుత్ తీగలకు తగిలి మృతి చెందాడు. ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లిన తల్లిదండ్రులు కొడుకు మృతి చెందిన వార్త విని హుటాహుటిన కోపల్లె బయలుదేరి వస్తున్నట్లు సమాచారం.


