News April 6, 2024
ప.గో.: కాపుల వల్లే రాజకీయాల్లోకి వచ్చాను: మంత్రి

కాపుల వల్లే తాను రాజకీయాల్లోకి వచ్చానని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం తణుకులోని కమ్మ కళ్యాణ మండపంలో ఏర్పాటుచేసిన వైసీపీ కాపు నాయకుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి తనకు జడ్పీ ఛైర్మన్‌గా అవకాశం ఇచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు తన కుమారుడికి ఎంపీ సీటు ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డిని జీవితంలో మర్చిపోలేనని అన్నారు.
Similar News
News October 25, 2025
తణుకు డిపో నుంచి ప్రత్యేక బస్సులు: DM

కార్తీక మాసం సందర్భంగా తణుకు డిపో నుంచి రాష్ట్రంలోని పలు పుణ్య క్షేత్రాలు, విహార యాత్రలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తణుకు RTC డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్ శుక్రవారం తెలిపారు. పంచారామాలకు అక్టోబర్ 26, నవంబర్ 2, 9, 16 తేదీలలో రాత్రి 8 గంటలకు బస్సులు బయలుదేరుతాయన్నారు. కార్తీక సోమవారం దర్శనాల అనంతరం తిరిగి తణుకు చేరుతాయని చెప్పారు.
News October 25, 2025
డిగ్రీ ఫెయిలైన విద్యార్థులకు మరో అవకాశం

డిగ్రీ ఫెయిలైన విద్యార్థులకు మరో అవకాశం కల్పించినట్లు డీఎన్ఆర్ డిగ్రీ ప్రిన్సిపల్ జి.మోజెస్ శుక్రవారం తెలిపారు. 2001-20 మధ్య కాలంలో డిగ్రీ ఫెయిలైన అభ్యర్థులకు యూనివర్సిటీ మరో అవకాశం కల్పించిందన్నారు. పరీక్ష ఫీజు కట్టి, డిగ్రీ పూర్తి చేయడానికి యూనివర్సిటీ అవకాశం కల్పించిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News October 24, 2025
నర్సాపురంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

నర్సాపురంలోని 29వ వార్డులోని స్థానిక కళాశాల సమీపంలో నిడదవోలు నుంచి మొగల్తూరు వెళ్లే పంట కాలువలో శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న నరసాపురం ఎస్సై ఎస్ఎన్ ముత్యాలరావు మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. మృతదేహానికి సంబంధించి ఎవరికైనా సమాచారం తెలిస్తే నరసాపురం పట్టణ పోలీసులను సంప్రదించాలన్నారు.


