News September 10, 2024
ప.గో: కారును అడ్డగించి నగదు, బంగారం దోపిడీ

దారి కాచి 3 కాసుల బంగారం, రూ.50 వేల నగదు, సెల్‌ఫోన్ అపహరించిన ఘటనపై తణుకు పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. ఏలూరు జిల్లా గణపవరం మండలం సరిపల్లి గ్రామానికి చెందిన తోట సత్తిపండు తన ముగ్గురి స్నేహితులతో కలిసి కారులో రాజమండ్రి నుంచి స్వగ్రామానికి వస్తున్నాడు. ఈ క్రమంలో డీమార్ట్ వద్ద ఇద్దరు దుండగులు సత్తిపండు కారును అడ్డగించారు. అతడిని బైక్‌పై నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి దోపిడీకి పాల్పడ్డారు.
Similar News
News December 12, 2025
నరసాపురం నుంచి వందేభారత్

నరసాపురం – చెన్నైకి వందేభారత్ నడిచేందుకు ఈ నెల 15 న ముహూర్తం ఖరారయింది. ప.గో నుంచి ఇదే తొలిసారి కావడంతో అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ రైలు నరసాపురం – విజయవాడ మధ్య నరసాపురం, భీమవరం, గుడివాడలో ఆగుతుంది. కాగా ఇది నరసాపురంలో మ. 2.50కి బయలుదేరి రాత్రి 11.45కు చెన్నైకి చేరుతుంది. తిరిగి ఉ. 5.35కు బయలుదేరి మ.2.10కి నరసాపురంలో ఉంటుంది.
News December 12, 2025
భీమవరం: లింక్ క్లిక్.. సినిమా స్టైల్లో నగదు మాయం

భీమవరంలోని శివరావుపేటకు చెందిన శ్రీరామదాసు సైబర్ మోసానికి గురయ్యాడు. ఫోన్‌కు వచ్చిన లింక్‌పై క్లిక్ చేయడంతో బ్యాంక్ అకౌంట్ నుంచి సినిమాలో చూపించే తరహాలో రూ.1,70,400 ఐదు దఫాలుగా వెంట వెంటనే కట్ అయిపోయాయి. దీంతో బాధితుడు వెంటనే సైబర్ క్రైమ్ నంబర్ 1930కు ఫిర్యాదు చేశాడు. భీమవరం టూటౌన్ సీఐ కాళీచరణ్ అకౌంట్లలో ఉన్న రూ.90 వేలు ఫ్రీజ్ చేయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News December 12, 2025
ప.గో : ఇకపై వాహన చలానాలు ఇలా..!

వాహనదారులు ట్రాఫిక్ ఉల్లంఘనలు చేసే సమయంలో ట్రాఫిక్ పోలీసులు విధించే చలానాలు ఇకపై ఫోన్‌పే ద్వారా చెల్లించాలని తణుకు పట్టణ సీఐ ఎన్.కొండయ్య కోరారు. ఫోన్‌పేలో కొత్తగా ఈ ఛాలాన్ అనే టాబ్ ద్వారా వాహనం నంబర్ ఎంటర్ చేస్తే చలానాలు కనిపిస్తాయన్నారు. వాటిని తక్షణమే ఒక సెకన్లో చెల్లించి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని సీఐ కొండయ్య కోరారు.


