News July 15, 2024

ప.గో.: కొడుకు బర్త్ డే.. యాక్సిడెంట్‌లో తల్లి మృతి

image

ప.గో.జిల్లా తాడేపల్లిగూడెం వాసి సత్యశ్రీనివాస్ బర్త్‌డే సందర్భంగా తల్లిదండ్రులు, సోదరితో కలిసి ద్వారకాతిరుమలకు దర్శనానికి కారులో వెళ్లారు. తిరిగి వస్తుండగా నల్లజర్ల మండలం అచ్చన్నపాలెంలో మూవీ చూశారు. సోదరిని అత్తవారింట్లో దించి వస్తానని వారిని అక్కడే ఉండమని చెప్పాడు. ఈ క్రమంలో తల్లి సుబ్బలక్ష్మి, తండ్రి బసవరాజు రోడ్డు దాడుతుండగా వారిని కారు ఢీకొంది. ఆసుపత్రికి తరలిస్తుండగా సుబ్బలక్ష్మి చనిపోయింది.

Similar News

News November 20, 2025

బస్సెక్కుతుండగా.. రూ.15 లక్షల విలువైన బంగారం చోరీ

image

భీమవరం నుంచి నరసాపురం వెళ్లేందుకు బస్సెక్కుతున్న ఆంజనేయ ప్రసాద్ అనే వ్యక్తి నుంచి రూ.15 లక్షల విలువైన బంగారాన్ని గుర్తుతెలియని దుండగుడు అపహరించాడని సీఐ నాగరాజు వెల్లడించారు. ఈ నెల 17న జరిగిన ఈ ఘటనపై బాధితుడు బుధవారం వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నీలం చొక్కా ధరించిన వ్యక్తి బంగారం ప్యాకెట్‌ను లాక్కుని పరారైనట్లు సీఐ నాగరాజు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News November 20, 2025

తాడేపల్లిగూడెం: సోషల్ మీడియాలో వేధింపులు.. ఇద్దరిపై కేసు

image

తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లికి చెందిన ఓ మహిళపై సోషల్ మీడియా వేదికగా అసభ్య పోస్టులు పెట్టి, బెదిరించిన ఘటనలో ఇద్దరిపై కేసు నమోదైంది. నిందితులు సురేశ్, శివప్రసాద్‌ తనను రూ.లక్ష ఇవ్వాలంటూ డిమాండ్ చేశారని బాధితురాలు తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రసాద్ వెల్లడించారు.

News November 19, 2025

ఈనెల 19న జిల్లాలో రైతుల ఖాతాలో రూ.68.97 కోట్లు

image

అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం కింద ఈ నెల 19న జిల్లాలోని 1,03,761 మంది రైతుల ఖాతాలలో రెండో విడతగా రూ.68.97 కోట్లు జమ కానున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఒక్కో రైతు ఖాతాలో కేంద్రం వాటా రూ. 2 వేలు, రాష్ట్రం వాటా రూ. 5 వేలు చొప్పున మొత్తం రూ.7 వేలు జమ కానున్నాయి. నిధుల జమ కార్యక్రమానికి జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ పేర్కొన్నారు.