News May 19, 2024
ప.గో: కొత్తిమీర ధర కిలో రూ.100..!

కొత్తిమీర ధర వినియోగదారులను హడలెత్తిస్తోంది. ప.గో జిల్లా పెనుగొండ మండలంలోని పలు మార్కెట్లలో శనివారం కిలో కొత్తిమీర రూ.100 పలికిందని తెలిపారు. స్థానికంగా పంట లేకపోవడంతో బెంగళూరు వంటి ప్రాంతాల నుంచి వ్యాపారులు కొత్తిమీర దిగుమతి చేస్తున్నారని, దీంతో రవాణా ఛార్జీలతో కలుపుకొని కేజీ కట్ట రూ.100 పలుకుతోందని చెబుతున్నారు. ధర చూసిన వినియోగదారులు హడలెత్తిపోతున్నారు.
Similar News
News October 24, 2025
డీఎస్పీకి RRR కితాబివ్వడం సరికాదు: కొత్తపల్లి

డిప్యూటీ స్పీకర్ రఘురామ భీమవరం డీఎస్పీకి కితాబులిస్తూ మాట్లాడటం సరికాదని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు. ‘ప.గో జిల్లాలో పేకాట సహజమంటూ RRR చెప్పడం వల్ల ఇక్కడి ప్రజలపై తప్పుడు భావన వెళ్లే ప్రమాదం ఉంది. డీఎస్పీపై వచ్చిన ఆరోపణలపై డిప్యూటీ సీఎం హోదాలో విచారించి నివేదిక ఇవ్వమన్నారే తప్ప ముందస్తుగా చర్యలు తీసుకోమనలేదు. దీనిపై పవన్తో RRR నేరుగా మాట్లాడాల్సింది’ అని అన్నారు.
News October 24, 2025
కలెక్టరేట్లో కంట్రోలు రూమ్ ఏర్పాటు: కలెక్టర్

ప్రస్తుతం కురుస్తున్న వర్షాల పట్ల జిల్లా యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం తెలిపారు. శుక్రవారం భారీ వర్షం కురుస్తుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలను అనుసరించి కలెక్టర్ కార్యాలయంతో పాటు డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో 88162 99219 ఫోన్ నంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వివరించారు.
News October 23, 2025
అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

జిల్లాలో రానున్న 2 రోజులు భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ నాగరాణి
గురువారం అన్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదన్నారు. వెళ్లిన వారు వెంటనే ఒడ్డుకు చేరుకోవాలన్నారు. శిథిలావస్థలో ఉన్న గృహాల్లో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజల కోసం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నంబర్ 08816-299219 ఏర్పాటు చేశామన్నారు.


