News March 3, 2025
ప.గో : కొన్ని గంటల్లో ఉత్కంఠకు తెర

గత నెల 27వ తేదీన జరిగిన ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల విజేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. కాగా అభ్యర్థులు అందరూ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. తుది ఫలితం సోమవారం సాయంత్రం 6 గంటలకు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Similar News
News March 4, 2025
ప.గో: కొనసాగుతున్న కౌంటింగ్.. దూసుకుపోతున్న పేరాబత్తుల

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరానికి 48,923 ఓట్లు, పీడీఎఫ్ అభ్యర్థి వీర రాఘవులకు 16,806 ఓట్లు పోలయ్యాయి. 28 టేబుళ్లలో 3వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యే సమయానికి 76,345 ఓట్లు చెల్లినవి కాగా, 7,655 చెల్లని ఓట్లుగా నిర్ధారించారు. రాజశేఖరం, వీర రాఘవులు మధ్య 32,117 ఓట్ల వ్యత్యాసం ఉంది.
News March 4, 2025
జైన్ ఇరిగేషన్ సిస్టంతో ఉద్యాన వర్సిటీ ఎంవోయూ

తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్న గూడెంలోని డా. వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం మహారాష్ట్రలోని జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ కంపెనీతో సోమవారం అవగాహన ఒప్పందం చేసుకుంది. జైన్ ఇరిగేషన్ సిస్టం నిర్వహిస్తున్న అత్యధిక టిష్యూ కల్చర్ ల్యాబ్ సదుపాయాలను, రీసెర్చ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం విభాగాలను ఉద్యాన విశ్వవిద్యాలయం విద్యార్థులు ఉపయోగించుకునేందుకు వీలుగా ఈ ఒప్పందం చేసుకున్నట్లు ఉపకులపతి కే. గోపాల్ తెలిపారు.
News March 4, 2025
పెనుగొండ: గోదావరిలో మహిళ మృతదేహం లభ్యం

శుభకార్యానికి వెళ్లే విషయమై ఏర్పడిన వివాదం నేపథ్యంలో ఓ వివాహత ఆత్మహత్య చేసుకున్న ఘటన పెనుగొండ మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వెంకటాపురం గ్రామానికి చెందిన ఉప్పలపాటి శ్రీదేవి ఆదివారం శుభకార్యానికి హాజరయ్యే విషయమై ఇంట్లో గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన ఆమె గోదావరిలో దూకింది. కాగా సోమవారం దొంగరావిపాలెం వద్ద ఆమె మృతదేహాన్ని కనుగొన్నట్లు పెనుగొండ ఎస్ఐ కే.గంగాధర్ తెలిపారు.