News September 9, 2024
ప.గో: కోతుల దాడిలో 50 మందికి గాయాలు

ప.గో జిల్లా పెంటపాడు మండలం వెస్ట్ విప్పర్రులో కోతులు దడ పుట్టిస్తున్నాయి. గుంపులుగా ఇళ్లపై తిరుగుతూ దాడి చేస్తున్నాయంటూ స్థానికులు వాపోతున్నారు. వారం రోజులుగా గ్రామంలో ఇదే సమస్య ఉందని, సుమారు 50 మందికి పైగా గాయాల పాలయ్యారని తెలిపారు. వీరంతా తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో చేరుతున్నారని చెప్పారు. అధికారులు స్పందించి కోతుల బెడద లేకుండా చూడా కోరుతున్నారు.
Similar News
News November 14, 2025
పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించాలి

జిల్లాలో పెద్ద ఎత్తున వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహించాలని జేసి రాహుల్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రతి నెల 3వ శనివారం పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ సంస్థలలో స్వచ్ఛ ఆంధ్ర దినోత్సవంగా పాటించాలన్నారు. వ్యక్తిగత, సమాజ పరిశుభ్రత కార్యక్రమాలను జిల్లా అంతట విస్తృతంగా నిర్వహించాలన్నారు.
News November 14, 2025
తణుకు: మహిళ కడుపులో భారీ కణితి తొలగింపు

తణుకు పట్టణంలోని ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో గురువారం అరుదైన చికిత్స నిర్వహించారు. పెనుగొండ మండలం దేవ గ్రామానికి చెందిన ఓ మహిళ తీవ్ర కడుపునొప్పితో ఆసుపత్రికి వచ్చారు. కొన్ని నెలలుగా బాధపడుతున్న ఆమె గురువారం ఆసుపత్రికి రాగా..వైద్యురాలు పావని పరీక్షించి కణితి ఉన్నట్లు గుర్తించారు. శస్త్రచికిత్స చికిత్స చేసి 4 కిలోల కణితిని తొలగించారు.
News November 14, 2025
ఉండి: ‘దివ్యాంగ పిల్లలను ఆదరించాలి’

సమాజంలో ప్రతీ ఒక్కరు దివ్యాంగుల పిల్లలను ఆదరించాలని సహిత విద్య సమన్వయకర్త టి. శ్రీనివాసరావు అన్నారు. ఉండి నియోజకవర్గం స్థాయిలో ప.గో. జిల్లా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దివ్యాంగుల పిల్లలకు ఉచిత ఉపకరణాల నిర్ధారణ శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాల గురించి పిల్లల తల్లిదండ్రులకు ఆయన అవగాహన కల్పించారు. MEO వినాయకుడు, భవిత కేంద్రం టీచర్ మధు, ఫిజియోథెరపిస్ట్ పాల్గొన్నారు.


