News August 17, 2024

ప.గో.: క్షణికావేశంలో భర్తపై భార్య దాడి

image

నిడమర్రు మండలం పెదనిండ్రకొలనుకి చెందిన ఝాన్సీ, భర్త శ్రీను (38) మద్యం మత్తులో తరచూ భార్యతో గొడవపడుతూ ఉండేవాడు. శుక్రవారం వారు నివాసం ఉంటున్న ఎస్సీ కాలనీలో రేకుల షెడ్డు కూల్చివేత విషయంలో వాగ్వాదం జరగ్గా భర్తను నిలువరించే ప్రయత్నంలో గుణపంతో ఇద్దరి మధ్య తోపులాట జరగింది. దీంతో ఆవేశంలో శ్రీను తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై ఎస్సై వీర ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News September 19, 2024

ఏలూరు: స్కాలర్‌షిప్ పరీక్ష దరఖాస్తు గడువు పెంపు

image

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్ష దరఖాస్తు గడువును ఈ నెల 24 వరకు పెంచినట్లు ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారి అబ్రహం తెలిపారు. నిర్ణీత గడువులోపు ప్రభుత్వ, జడ్పీ, పురపాలక, ఎయిడెడ్, మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాలల 8వ తరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తులను www.bse.ap.gov.in వెబ్ సైట్లో ఉంచామన్నారు.

News September 19, 2024

ఏలూరు: కాలువలో దిగి బాలుడు మృతి

image

ఏలూరులో ఓ బాలుడు ఆడుకుంటూ కాలువలో దిగి ఊపిరాడక మృతి చెందాడు. పట్టణంలోని గ్జేవియర్ నగర్‌కు చెందిన బాలవిజ్ఞేశ్ బుధవారం ఇంటి సమీపంలో ఉన్న ఏటిగట్టున సోదరితో కలిసి ఆడుకుంటూ కాలువలోకి దిగాడు. చిన్నారి మునిగిపోవడం చూసిన సోదరి కేకలు వేయగా స్థానికులు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం బాలుడిని వెలికితీసి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేశారు.

News September 19, 2024

గుండెపోటుతో ఏలూరు సీసీఎస్ ఎస్సై మృతి

image

ఏలూరు సీసీఎస్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పని చేస్తున్న డి.నరసింహారావు గుండెపోటుతో బుధవారం రాత్రి మృతి చెందారు. ఏలూరుకు చెందిన ఆయన స్థానిక సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ క్రమంలో ఆయన బుధవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రిలో చేర్పించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.