News January 11, 2026
ప.గో: ఖద్దరు ఓకే.. ఆదేశాల కోసం ఎదురు చూస్తున్న ఖాకి!

ఉమ్మడి ప.గో. జిల్లాలో రాజకీయ నేతలు ఇప్పటికే బిరుల(పందెం బరి) నిర్వాహకుల నుంచి సొమ్ములు వసూలు చేస్తుంటే ఖాకీలు మాత్రం ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పోలీస్ శాఖలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఓ అధికారి తాను చేప్పేవరరకు వరకు అమ్యామ్యాలు తీసుకోవద్దు అంటూ మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో పందాల నిర్వాహకులు మాత్రం ఆదేశాలు అందాయా.? లేదా.? అని పోలీసులను తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
Similar News
News January 22, 2026
గ్రూప్-1 అభ్యర్థుల భవితవ్యంపై తీర్పు వాయిదా

TG: <<17820908>>గ్రూప్-1<<>> అభ్యర్థుల భవితవ్యంపై తీర్పును ఫిబ్రవరి 5కు హైకోర్టు వాయిదా వేసింది. గతంలో మెయిన్స్ ఫలితాలను రద్దు చేసి, తిరిగి మూల్యాంకనం చేయాలని సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. దీనిపై డివిజన్ బెంచ్ స్టే ఇవ్వగా తుదితీర్పునకు లోబడి నియామకాలు ఉండాలని పేర్కొంది. ఇవాళ తీర్పు వెల్లడించాల్సి ఉండగా కాపీ రెడీ కాకపోవడంతో FEB 5న ఇవ్వనున్నట్లు పేర్కొంది.
News January 22, 2026
ఎస్.జానకి కుమారుడు కన్నుమూత

లెజెండరీ సింగర్ ఎస్.జానకి కుమారుడు మురళీ కృష్ణ(65) కన్నుమూశారు. ఈ విషయాన్ని ప్రముఖ గాయని చిత్ర వెల్లడించారు. మురళీ మరణ వార్త షాక్‌కు గురి చేసిందని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న మురళీకృష్ణ పలు సినిమాల్లోనూ నటించారు. ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
News January 22, 2026
నెల్లూరు మీదుగా మరో ప్రతిష్ఠాత్మక రైలు.!

దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) తాజాగా హైదరాబాద్ (చర్లపల్లి)-తిరువనంతపురం నార్త్ మధ్య కొత్త అమృత్ భారత్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ ప్రవేశపెట్టబోతోంది. ఈ రైలు నెల్లూరు మీదుగా వెళ్లనుంది. నెల్లూరుకు ఉదయం 5:43కు రానున్న ఈ రైలు 5.45AMకు బయలుదేరి 4:30 PMకు చర్లపల్లి చేరుకోనుంది. ఉదయాన్నే నెల్లూరు నుంచి HYD వెళ్లాలనుకునే వారికి ఈ రైలు ఉపయోగపడనుంది.


