News February 26, 2026
ప.గో: ఖాళీలు భర్తీ చేయకుంటే ఎలా (2/2)

ఉమ్మడి జిల్లా పరిషత్ పరిధిలో <<19245662>>ఉద్యోగుల కొరత<<>> పాలనను కుంగదీస్తోంది. 662 పోస్టులు ఖాళీగా ఉండటంతో కార్యకలాపాలకు ఆటంకం కలుగుతోంది. వీటిలో కీలకమైన అకౌంట్స్ అధికారి, 13 ఎంపీడీవో, పరిపాలనాధికారి, సీనియర్ అసిస్టెంట్లు, స్టెనోలు, 20 లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు అత్యధికంగా 419 ఆఫీస్ సబార్డినేట్, 177 క్లాస్-4 ఉద్యోగాలు భర్తీకి నోచుకోకపోవడంతో జిల్లా స్థాయిలో పరిపాలన కష్టసాధ్యంగా మారింది.
Similar News
News April 15, 2026
నిజామాబాద్: అంగన్‌వాడీ.. డిజిటల్ వే

అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అత్యాధునిక స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా దాదాపు 3,250 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, వీటికి కొత్త ఫోన్లను అందజేస్తున్నారు. పాత ఫోన్ల సాంకేతిక ఇబ్బందుల వల్ల డేటా నమోదులో జాప్యం జరుగుతోందని గుర్తించిన యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది. అంగన్‌వాడీ టీచర్లు కొత్త ఫోన్ల రాకతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
News April 15, 2026
WGL: 11 నెలలుగా అందని ఉపకార వేతనాలు

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ పరిధిలో ఇంటర్న్‌షిప్ చేస్తున్న ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్‌కు 11 నెలలుగా ఉపకార వేతనాలు రాలేదు. వారికి ప్రతి నెల రూ.5 వేల ఉపకార వేతనాలు ప్రభుత్వం ఇస్తుంది. గతేడాది జూన్‌లో కేఎంసీలో 12 మంది ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఇంటర్న్‌షిప్‌లో చేరారు. ప్రతి నెల చెల్లించాల్సిన ఉపకార వేతనాలు ఇప్పటికీ రాలేదు. ప్రభుత్వం విడుదల చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.
News April 15, 2026
విశాఖలో దారుణం.. కూలీని కొట్టి చంపిన తోటి కూలీలు

మధురవాడలోని బక్కన్నపాలెం సమీపంలోని ఓ లేబర్ క్యాంప్‌లో యువకుడు హత్యకు గురయ్యాడు. పీఎంపాలెం CI బాలకృష్ణ తెలిపిన వివరాలు ప్రకారం.. ఝార్ఖండ్‌కు చెందిన సికింధర్(19)కు తోటి కూలీలైన శ్యామ్, నజురుల్‌లతో మంగళవారం వివాదం జరిగింది. దీంతో వారు విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలైన సికింధర్ అక్కడికక్కడే మృతి చెందాడు.నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం KGHకి తరలించారు.


