News December 28, 2024
ప.గో: గన్ మిస్ ఫైర్..రిటైర్డ్ ఉద్యోగికి గాయాలు
సర్వీసు గన్ మిస్ ఫైర్ అయిన ఘటనలో రిటైర్డ్ మిలిటరీ ఉద్యోగి స్వల్ప గాయాల పాలయ్యాడు. నిడదవోలు మండలం కాటకోటేశ్వరంకు చెందిన మిలిటరీ ఉద్యోగి కారింకి శ్రీనివాస్ తన గన్ను ప్రతి 6 నెలలకోసారి నిడదవోలు సీఐ కార్యాలయంలో తనిఖీ చేయిస్తుంటారు. గురువారం నిడదవోలు పోలీస్ కార్యాలయానికి తన గన్ను చెక్ చేయించడానికి తీసుకువచ్చి స్టేషన్ బయట కూర్చుని గన్ శుభ్రం చేస్తుండగా ట్రిగ్గర్ వేలికి తగిలి మిస్ ఫైర్ అయ్యింది.
Similar News
News January 1, 2025
భీమవరం: అత్యాచారానికి యత్నం.. వృద్ధుడికి ఐదేళ్ల జైలు శిక్ష
బాలికపై అత్యాచారం చేసేందుకు యత్నించిన వృద్ధుడికి భీమవరం పోక్సో కోర్టు ఐదేళ్లు జైలు శిక్ష విధించినట్లు భీమవరం రూరల్ SI వీర్రాజు తెలిపారు. భీమవరం మండలానికి చెందిన ఆరేళ్ల బాలికను నరసింహరాజు అనే వ్యక్తి తన ఇంటికి తీసుకెళ్లాడు. దీన్ని గమనించిన బాలిక అమ్మమ్మ కిటికి తలుపులో నుంచి చూడగా బాలికతో వృద్దుడు అసభ్యకరంగా ప్రవర్తించడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
News January 1, 2025
పాలకోడేరు: కేజీ మటన్ కొంటే కేజీ చికెన్ ఫ్రీ
కొత్త సంవత్సరం వేళ ఓ మాంసం వ్యాపారి భలే ఆఫర్ తీసుకొచ్చారు. పాలకోడేరు మండలం గొల్లలకోడేరులో కేజీ మటన్ కొంటే.. కేజీ చికెన్ ఫ్రీ అంటూ ఆఫర్ పెట్టారు. దీంతో మాంసం ప్రియులు కొనుగోలు చేసేందుకు ఎగబడ్డారు. అలాగే కేజీ చికెన్ కొంటే కేజీ ఉల్లిపాయలు ఫ్రీ అంటూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. అలాగే కేక్, బిర్యానీ కొన్న వారికి కూల్ డ్రింక్నూ ఉచితంగా అందించారు.
News January 1, 2025
ప.గో: రైతుల ఖాతాల్లో రూ 911కోట్లు జమ- కలెక్టర్
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆరునెలల ప్రగతి తెలిపారు. రైతులకు వారు తోలిన ధాన్యానికి రూ.911కోట్లు వారి ఖాతాలకు తోలిన రెండు రోజుల్లో వేశామన్నారు. అన్నం పెట్టే రైతుకు అందరూ అండగా ఉండాలన్నారు. అలాగే ఎన్ ఆర్ జీ ఎస్ ఉపాధి హామీ పథకంలో రోడ్ల నిర్మాణం, రెవెన్యూ సదస్సులో 511గ్రామాలనుంచి అర్జీలు అందాయన్నారు.