News July 16, 2024

ప.గో.: గురుకులాల్లో పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

గురుకులాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి ప.గో. జిల్లా సమన్వయ అధికారి భారతి తెలిపారు. పురుష అభ్యర్థులు గణితం-5, సోషల్-1, బోటనీ-1, ఇంగ్లిష్-1, హిందీ-1, హెల్త్ సూపర్వైజర్-1, పీఈటీ-2, మహిళా అభ్యర్థులు హిందీ-1,బోటనీ-1, జువాలజీ-1,ఇంగ్లీషు-2 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ నెల 18 లోగా సర్టిఫికెట్ల జిరాక్స్‌లను జిల్లా సమన్వయ అధికారి, AP సాంఘిక సంక్షేమ శాఖ ఏలూరుకు పంపాలి.

Similar News

News November 28, 2025

ప.గో: టీచర్‌గా మారిన కలెక్టర్ చదలవాడ

image

విద్యార్థుల భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. శుక్రవారం తణుకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి, 10వ తరగతి విద్యార్థులతో మమేకమై ఆమె కొద్దిసేపు టీచర్‌గా మారారు. గడిచిపోయిన రోజు తిరిగి రాదని, ఎప్పటి పాఠాలు అప్పుడే చదువుకోవాలని హితవు పలికారు. విజ్ఞానాన్ని పెంచుకోవడానికి మాత్రమే సెల్‌ఫోన్ వినియోగించాలని ఆమె కోరారు.

News November 28, 2025

రైతులు అప్రమత్తంగా ఉండాలి: జేసీ

image

గణపవరం మండలం జల్లికొమ్మరలో ఉన్న రైతు సేవా కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ధాన్యం కొనుగోలు, గోనె సంచుల రిజిస్టరు, ట్రక్ షీట్‌లను పరిశీలించారు. ట్రక్ షీట్ వెనుక భాగంలో తేమ శాతాన్ని తప్పక నమోదు చేయాలని ఆదేశించారు. ‘దిత్వా’ తుఫాన్ కారణంగా రానున్న రెండు, మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

News November 28, 2025

ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

image

తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ చదలవాడ నాగరాణి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమ్మెల్యే ఆరవెల్లి రాధాకృష్ణతో కలిసి ఆమె ఆసుపత్రిని క్షుణ్ణంగా పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, వసతుల గురించి కలెక్టర్ ఆరా తీశారు. ఆసుపత్రి ప్రాంగణంలో జరుగుతున్న నూతన నిర్మాణాలను పరిశీలించి ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సాయికిరణ్ ఆమె వెంట ఉన్నారు.