News January 3, 2025

ప.గో: ‘గేమ్ ఛేంజర్’ పాసుల కోసం నాయకుల చుట్టూ ప్రదక్షిణలు

image

రాజమండ్రిలో జరగబోయే గేమ్ ఛేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సందడి చేసేందుకు ప.గో జిల్లా మెగా ఫ్యాన్ రెడీ అవుతున్నారు. ఈవెంట్ పాసులు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం లోకల్ లీడర్ల చుట్టూ మెగాభిమానులు, జనసైనికులు ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే అందరికీ పాస్‌లు అందించలేక నాయకులు తలలు పట్టుకుంటున్నట్లు సమాచారం. ఫ్యాన్స్ భారీగా వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు.

Similar News

News January 18, 2025

జర్మనీ అబ్బాయి, ఏలూరు జిల్లా అమ్మాయి నిశ్చితార్థ వేడుక 

image

దేశాలు దాటిన ప్రేమ పెళ్లిగా మారిన అపూర్వ ఘటన టీ.నర్సాపురం మండలం ఏపుగుంటలో గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఏపుగుంటకు చెందిన లావణ్య జర్మనీలో ఉద్యోగ రీత్యా పనిచేస్తున్న సమయంలో మార్కస్, లావణ్యల మధ్య ప్రేమ చిగురించింది. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించారు. దీంతో ఇవాళ గ్రామంలో వీరి నిశ్చితార్థం ఘనంగా నిర్వహించారు. వివాహం జర్మనీలో జరుగుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు.

News January 18, 2025

ఏలూరు: చనిపోయిన కోడికి వేలం..రూ. లక్ష

image

సంక్రాంతి కోడిపందేల బరిలో మృతి చెందిన ఓ కోడికి యజమానులు వేలంపాట నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే జాలిపూడికి చెందిన నవీన్ చంద్రబోస్ వేలంపాటలో పాల్గొన్నారు. రూ.1,11,111 వెచ్చించి కోడిని దక్కించుకున్నారు. ఈ వేలం పాటకు అధిక సంఖ్యలో జనం పోటీ పడగా చంద్రబోస్ గెలుపొందారు.

News January 18, 2025

‘సంక్రాంతికి వస్తున్నాం’ బుల్లి రాజుది మన ఏలూరే

image

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలోని బుల్లి రాజు క్యారెక్టర్‌తో అందరినీ అలరించిన రేవంత్ ఏలూరు జిల్లా నిడమర్రు మండలం చానమిల్లి గ్రామానికి చెందిన రొయ్యల వ్యాపారి భీమాల శ్రీనివాస రావు కుమారుడు. రేవంత్ ‘సంక్రాంతికి వస్తున్నాం’లో వెంకటేశ్‌కి కొడుకుగా నటించే ఛాన్స్ కొట్టేశాడు. 11 సంవత్సరాల వయసులో సినిమా ఇండస్ట్రీకి కొత్తైనా తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు.