News January 30, 2025
ప.గో: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. 10వ తేదీ వరకు నామినేషన్ల దాఖలు, 11న నామినేషన్ల పరిశీలన, 13న నామినేషన్ల ఉపసంహరణ, 27న ఉదయం 8.నుంచి సాయంత్రం 4 గంటలకు పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. కూటమి తరఫున టీడీపీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖరం, పీడీఎఫ్ అభ్యర్థిగా డీవీ రాఘవులు, పేరును ఇప్పటికే ప్రకటించారు.
Similar News
News December 9, 2025
ప.గో జిల్లా ప్రజలారా.. ఈ నెంబర్లు సేవ్ చేసుకోండి

ఉమ్మడి ప.గో జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేసినా, అవినీతికి పాల్పడినట్లు తెలిసినా, ప్రజలు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు కోరుతున్నారు. ఏసీబీ డీఎస్పీ 9440446157, సీఐలు 9440446158, 9440446159, టోల్ ఫ్రీ 1064కు ఫిర్యాదు చేయవచ్చాన్నారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు. (నేడు అంతర్జాతీయ అవినీతి నిరోధక దినం)
News December 9, 2025
ఈ కమిషనర్ మాకొద్దు: నరసాపురం కౌన్సిల్ ఫిర్యాదు

నరసాపురం మున్సిపల్ కమిషనర్ అంజయ్యను ప్రభుత్వానికి సరెండర్ చేయాలని మునిసిపల్ చైర్‌పర్సన్ బర్రె శ్రీ వెంకట రమణతో పాటు వైసీపీ కౌన్సిల్ సభ్యులు జేసీ రాహుల్ కుమార్ రెడ్డికి PGRSలో ఫిర్యాదు చేశారు. అభివృద్ధి పనులకు కౌన్సిల్ తీర్మానం చేసినా పట్టించుకోవట్లేదని, అవినీతి ఆరోపణలు వంటి కారణాల వల్ల ఆయనను సరెండర్ చేయాలని కౌన్సిల్ తీర్మానించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు తీర్మాన పత్రాన్ని జేసీకి అందించారు.
News December 9, 2025
ప.గో జిల్లా మొత్తం 8 పరీక్షా కేంద్రాలు

డిసెంబర్ 10 నుంచి 21 వరకు జరిగే టెట్(TET) పరీక్షల కోసం జిల్లాలో 8 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జేసీ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. భీమవరం 5, నరసాపురం 1, తాడేపల్లిగూడెంలో 2 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 12,985 మంది అభ్యర్థులు హాజరవుతారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.


