News May 8, 2024
ప.గో: చుక్కలేక మందు బాబులు తిప్పలు
ఎన్నికల నేపథ్యంలో మద్యంకు భారీ డిమాండ్ నెలకొంది. ప్రచారంలో భాగంగా రాజకీయ పార్టీలు మద్యం పంపిణీకి రంగం సిద్ధం చేయడంతో కొరత ఏర్పడింది. ముందుగానే ప్రభుత్వ మద్యం షాపుల్లో, ప్రైవేటు మాల్స్‌లో కొనుగోలు చేసి నిల్వలు ఉంచిన్నట్లు తెలుస్తోంది. పరిమితంగానే అమ్మకాలు జరగాలనే సంబంధిత శాఖ ఆదేశాలు ఉన్నాయి. చుక్కలేక మద్యం ప్రియులు అల్లాడిపోతున్నారు. పాలకొల్లులోని ప్రభుత్వ మాల్స్‌లో నిల్వలు లేక వెలవెలబోతున్నాయి.
Similar News
News November 30, 2024
పాలకోడేరు: వ్యక్తిపై మహిళ యాసిడ్ దాడి
అప్పు ఇచ్చి అడిగినందుకు వ్యక్తిపై మహిళ యాసిడ్ దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయవాడకు చెందిన రేష్మతో పాలకోడేరుకు చెందిన బాలకృష్ణకు పరిచయం ఏర్పడింది. ఈ సందర్భంలో దఫాల వారీగా 2.40 లక్షలను అప్పుగా రేష్మకు బాలకృష్ణ ఇచ్చాడు. ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వమని అడిగిన బాలకృష్ణపై ఈ నెల 6న మహిళ యాసిడ్ పోసిందని పాలకోడేరు SI రవివర్మ తెలిపారు. శుక్రవారం బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
News November 30, 2024
నరసాపురం హోటళ్లలో మున్సిపల్ కమిషనర్ తనిఖీలు
నరసాపురం పట్టణ పరిధిలోని పలు హోటళ్లను నరసాపురం మున్సిపల్ కమిషనర్ ఎం. అంజయ్య తన సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు. శుక్రవారం నిర్వహించిన ఈ తనిఖీల్లో పరిశుభ్రత, ఆహార ఉత్పత్తుల నాణ్యతతను క్షుణ్ణంగా పరిశీలించి యజమానులకు పలు సూచనలు చేశారు. పరిశుభ్రత పాటించకుంటే చర్యలు తప్పవని ఆయా హోటళ్ల నిర్వాహకులను హెచ్చరించారు.
News November 29, 2024
ఏలూరు జిల్లాను నెంబర్ వన్ స్థానంలో ఉంచాలి: కలెక్టర్
ఏలూరు జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి శుక్రవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆయా శాఖల ప్రణాళికల లక్ష్య సాధనపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని వ్యవసాయ, ఉద్యానవన, మత్స్య, పరిశ్రమ, విద్యా, వైద్యం, రోడ్డు, భవనాలు తదితర శాఖలు లక్ష్యంతో పనిచేయాలన్నారు. మనం చేసే కార్యాచరణతో రాష్ట్ర స్థాయిలో జిల్లా మొదటి స్థానంలో ఉండాలన్నారు.