News May 26, 2024
ప.గో.: జనసేన అభ్యర్థులు గెలవాలని ప్రత్యేక పూజలు

సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసిన జనసేన అభ్యర్థులు గెలవాలని ఆ పార్టీకి చెందిన ఓ నాయకుడు ప్రత్యేకపూజలు చేయించారు. ప.గో. జిల్లా నరసాపురం మండలం LB.చర్ల గ్రామానికి చెందిన జనసైనికుడు కటకంశెట్టి సంజీవరావు అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయంలో పవన్కళ్యాణ్, నాయకర్ చిత్రపటాలతో కూర్చొని ప్రత్యేక పూజలు చేయించారు.
Similar News
News December 8, 2025
భీమవరం: రక్తదాన వార్షికోత్సవ గోడపత్రికలు ఆవిష్కరణ

భీమవరం కలెక్టరేట్లో జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి ప.గో.జిల్లా యూనిట్ ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లాలో 2026వ సంవత్సర వార్షిక రక్తదాన శిబిరాల ఏర్పాటు గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. రెడ్క్రాస్ సొసైటీ జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బందితో 2025 డిసెంబర్ 1 నుంచి 2026 నవంబర్ 30 వరకు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు.
News December 8, 2025
ప.గో జిల్లా కీలక నేత వైసీపీకి ‘బై’

తాడేపల్లిగూడేనికి చెందిన వైసీపీ ఎస్టీ విభాగం జిల్లా మాజీ అధ్యక్షుడు కావాడి శివ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని జిల్లా పార్టీ అధ్యక్షుడు ప్రసాద్ రాజుకు అందజేసినట్లు సోమవారం తెలిపారు. పార్టీ కార్యక్రమాల సమాచారం ఇవ్వకపోవడం, తగిన గుర్తింపు లేకపోవడం వంటి కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. భవిష్యత్తు కార్యాచరణను త్వరలో ప్రకటిస్తానన్నారు.
News December 8, 2025
ఘోర అగ్నిప్రమాదంలో తాడేపల్లిగూడెం యువకుడి మృతి

అమెరికాలోని బర్మింగ్ హామ్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. అందులో తాడేపల్లిగూడేనికి చెందిన అన్వేష్ రెడ్డి ఒకరు. ఘటనలో తీవ్రగాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. కాగా వీరి కుటుంబం HYDలోని కూకట్ పల్లిలో నివాముంటోంది.


