News November 2, 2024
ప.గో.జిల్లాకు నేడు ఇన్‌ఛార్జ్ మంత్రి రాక

పశ్చిమ గోదావరి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శనివారం భీమవరం రానున్నారు. ఉదయం 9.30 గంటలకు టీడీపీ కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలతో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు. 10.30 గంటలకు స్థానిక మల్టీప్లెక్స్ ఆవరణలో కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ, కూటమి నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం 12 గంటలకు కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించనున్నట్లు కార్యాలయ వర్గాలు తెలిపాయి.
Similar News
News December 22, 2025
ప.గో జిల్లాలో యూరియా కొరత లేదు: జేసీ

జిల్లాలో యూరియా కొరత లేదని రబీ సీజన్‌కు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి భీమవరంలో తెలిపారు. జిల్లాలో రబీ పంటకు, అన్ని పంటలకు అవసరమైన 36,820 మెట్రిక్ టన్నుల యూరియా ఎరువుల పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది అన్నారు. అక్టోబర్ 1 నాటికి 7,009 మెట్రిక్ టన్నుల యూరియా ప్రారంభ నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
News December 22, 2025
అండర్-19 నేషనల్ క్రికెట్ పోటీలకు భీమవరం విద్యార్థి ఎంపిక

ఢిల్లీలో ఈ నెల 24 నుంచి 27 వరకు జరగనున్న అండర్-19 నేషనల్ క్రికెట్ టోర్నమెంట్‌కు భీమవరం విద్యార్థి ఒల్లిపల్లి దుర్గా రాంచరణ్ ఎంపికయ్యాడు. 9వ తరగతి చదువుతున్న రాంచరణ్ ఇప్పటి వరకు 72 మ్యాచ్‌లు ఆడి 46 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లో 139 పరుగుల అత్యధిక స్కోరు సాధించాడు. రాంచరణ్ మరిన్ని విజయాలు సాధించాలని స్థానికులు కోరుతున్నారు.
News December 22, 2025
తణుకు: బియ్యపు గింజపై బంగారంతో వైఎస్ జగన్ పేరు

మాజీ CM వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా తణుకుకు చెందిన సూక్ష్మ కళాకారుడు భవిరి నాగేంద్రకుమార్ తన ప్రతిభ చాటుకున్నారు. 0.030 పాయింట్ల బంగారంతో బియ్యపు గింజపై జగన్ పేరును తీర్చిదిద్దారు. సుమారు మూడు గంటల సమయం వెచ్చించి దీనిని సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు. నాగేంద్ర కుమార్ నైపుణ్యాన్ని స్థానికులు, వైసీపీ నేతలు మెచ్చుకున్నారు.


