News August 6, 2024
ప.గో. జిల్లాలో అటవీ ప్రాంతాన్ని పెంచుతాం: పవన్
పశ్చిమగోదావరి జిల్లాలో అటవీ ప్రాంతాన్ని పెంచుతామని, అటవీ సంరక్షణ చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సోమవారం వెలగపూడిలోని సచివాలయంలో సోమవారం నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. ప.గో. జిల్లా కలెక్టర్ నాగరాణి, ఏలూరు కలెక్టర్ వెట్రిసెల్వి పాల్గొన్నారు.
Similar News
News September 20, 2024
ఏలూరు: సులభంగా ఇసుక బుక్ చేసుకోండి ఇలా..
ఏలూరు జిల్లాలో ఇవాళ్టి నుంచి ఏపీ శాండ్ మేనేజ్మెంట్ సిస్టం పోర్టల్ ద్వారా ఇసుక సరఫరా జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. కేవలం రవాణా, నిర్వహణ ఖర్చులను మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని ఆమె వివరించారు. ప్రభుత్వ వెబ్ సైట్ www.sand.ap.gov.in ద్వారా ఇసుక బుక్ చేసుకోవచ్చన్నారు. అలాగే ఉచిత ఇసుక విధానానికి సంబంధించి టోల్ ఫ్రీ నెం.1800 425 6025, 08812-234014 సంప్రదించాలని ఆమె వెల్లడించారు.
News September 20, 2024
కొవ్వూరులో అల్లర్లు.. 144 సెక్షన్ విధింపు
కొవ్వూరులో వినాయక నిమజ్జనం సందర్భంగా గురువారం అర్ధరాత్రి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. రాజీవ్ కాలనీ నుంచి వినాయక నిమజ్జనానికి ఊరేగింపు వస్తుండగా అదే వార్డులోని శ్రీరామ కాలనీలో ఊరేగింపుపై కొందరు రాళ్లు వేశారు. దీంతో ఇరువర్గాల వారు కర్రలతో దాడులు చేసుకోగా పలువురికి గాయాలయ్యాయి. దీంతో గాయపడిన వారిని కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అల్లర్లను అదుపు చేసి పోలీసులు 144 సెక్షన్ విధించారు.
News September 20, 2024
అండర్–19 విభాగంలో క్రీడాకారుల జట్లు ఎంపికలు
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–19 విభాగంలో క్రీడాకారుల జట్లు ఎంపికలను గురువారం తణుకు మహిళా కళాశాలలో నిర్వహించారు. టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, వాలీబాల్, ఖోఖో, యోగా, త్రోబాల్, చదరంగం, టెన్నికాయిట్ విభాగాల్లో 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఎంపికైన క్రీడాకారులను జూనియర్ మహిళా కళాశాల ప్రిన్సిపల్ భూపతిరాజు హిమబిందు అభినందించారు.