News July 3, 2024
ప.గో జిల్లాలో ఆశాజనకంగా చేపల ధరలు

చేపల ధరలు సంవత్సరం తర్వాత ఆశాజనకంగా మారాయి. రోహూ, కట్లా జాతులకు టన్నుకు రూ.15వేలు పెరిగింది. గతేడాది మార్చిలో కనీసం ఖర్చులు రాని పరిస్థితి నుంచి ప్రస్తుతం లాభాలను స్వీకరించే స్థాయికి రైతులు చేరుకున్నారు. ఉమ్మడి ప.గో జిల్లాలో 2.80 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు విస్తరించి ఉంది. అందులో 1.40 లక్షల ఎకరాల్లో తెల్ల చేపలు, 30 వేల ఎకరాల్లో ఫంగస్ రకానికి చెందిన చేపలు, లక్ష ఎకరాల్లో రొయ్య సాగు చేస్తున్నారు.
Similar News
News October 21, 2025
తణుకు: ఇరు వర్గాల ఘర్షణ.. ఏడుగురికి గాయాలు

తణుకు మండలం తేతలిలో సోమవారం రాత్రి దీపావళి పండుగ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణలో ఏడుగురు గాయపడ్డారు. వివాదం తీవ్రమై ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. క్షతగాత్రులను వెంటనే తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై తణుకు రూరల్ ఎస్ఐ కె. చంద్రశేఖర్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 20, 2025
భీమవరం: ఈనెల 23న ఎంపీడీఓ కార్యాలయంలో ప్లేస్మెంట్ డ్రైవ్

AP రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, నేషనల్ కెరీర్ సర్వీస్ ఆధ్వర్యంలో ఈనెల 23న భీమవరం MPDO కార్యాలయంలో ప్లేస్మెంట్ డ్రైవ్ జరగనుంది. 18-35 సంవత్సరాల నిరుద్యోగ యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నైపుణ్యాభివృద్ధి జిల్లా అధికారి పి.లోకమాన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు https://naipunyam.ap.gov.inలో నమోదు చేసుకోవాలని, వివరాలకు 86885 94244 ఈ నంబర్‌కు సంప్రదించాలన్నారు.
News October 20, 2025
నరసాపురంలో కూతురిపై తండ్రి అత్యాచారం

నరసాపురంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఎస్ఐ విజయలక్ష్మి వివరాల మేరకు.. పట్టణానికి చెందిన ఓ మహిళ ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లింది. కుమార్తె(13) 9వ తరగతి చదువుతోంది. భర్త మద్యానికి బానిసయ్యాడు. జులైలో కుమార్తె(13)పై మద్యం మత్తులో తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. ఇటీవల తల్లి గల్ఫ్ నుంచి వచ్చింది. విషయం తెలుసుకుని పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేసింది.