News July 3, 2024
ప.గో జిల్లాలో ఆశాజనకంగా చేపల ధరలు
చేపల ధరలు సంవత్సరం తర్వాత ఆశాజనకంగా మారాయి. రోహూ, కట్లా జాతులకు టన్నుకు రూ.15వేలు పెరిగింది. గతేడాది మార్చిలో కనీసం ఖర్చులు రాని పరిస్థితి నుంచి ప్రస్తుతం లాభాలను స్వీకరించే స్థాయికి రైతులు చేరుకున్నారు. ఉమ్మడి ప.గో జిల్లాలో 2.80 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు విస్తరించి ఉంది. అందులో 1.40 లక్షల ఎకరాల్లో తెల్ల చేపలు, 30 వేల ఎకరాల్లో ఫంగస్ రకానికి చెందిన చేపలు, లక్ష ఎకరాల్లో రొయ్య సాగు చేస్తున్నారు.
Similar News
News October 12, 2024
ప.గో: బాలుడు చికిత్సకు సానుకులంగా స్పందించిన మంత్రి
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తెడ్లూం గ్రామానికి చెందిన 3 ఏళ్ల బాలుడు సాత్విక్ వివిధ అనారోగ్య కారణాలతో ఆసుపత్రుల్లో వైద్యం చికిత్స పోందుతున్నాడు. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థతి అంతమాత్రంగానే ఉండటంతో సాయం కోసం సంబంధిత చికిత్స పత్రాలతో ట్విటర్‌లో మంత్రి నారా లోకేశ్‌కు ట్యాగ్ చేశారు. మంత్రి లోకేశ్ స్పందిస్తూ.. సమస్యను పరిశీలించానని త్వరలోనే తన బృందం బాధిత కుటుంబాన్ని సంప్రదిస్తుందని ఆయన పేర్కొన్నారు.
News October 11, 2024
భీమవరం: ‘విరాళాలు అందించడంలో జిల్లా మొదటి స్థానం’
విజయవాడ వరద బాధితులకు సహాయం అందించడంలో పశ్చిమగోదావరి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానం సాధించిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..జిల్లాలో సేకరించిన విరాళాల మొత్తాన్ని రూ.1,17,66,351 లు శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అందజేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో జెసి రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
News October 11, 2024
నిడమర్రు: రూ.1.2కోట్లతో ధనలక్ష్మి అమ్మవారు అలంకరణ
నిడమర్రు మండలం పెదనిండ్రకొలను తూర్పు వెలమ పేటలో వెలసిన దుర్గమ్మను శుక్రవారం ధనలక్ష్మి దేవిగా అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారిని రూ.1.02 కోట్ల విలువైన కరెన్సీ నోట్లు, 140 కాసుల బంగారు నగలతో నిర్వహకులు విశేషంగా అలంకరించారు. ఈ సందర్భంగా ధనలక్ష్మి దేవి అలంకరణలోని అమ్మవారిని దర్శించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవారికి విశేష పూజలు నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు.