News January 14, 2025
ప.గో జిల్లాలో కోసా రూ. 3 వేలు

రసవత్తర పోరులో ఓడి ప్రాణాలు కోల్పోయిన పందెం కోళ్లకు ఉభయగోదావరి జిల్లాల్లో భలే గిరాకీ ధర పలుకుతోంది. అయితే ఇక్కడ పందేనికి సిద్ధం చేసే కోళ్లకు ఓ ప్రత్యేకమైన ఫుడ్ మెనూ ఉంటుంది. దీంతో అవి మరణించాక రుచిగా ఉంటాయని మాంసం ప్రియులు చెబుతూ ఉంటారు. దీంతో పందెంలోని ఒక కోసా రూ. 2వేలు నుంచి రూ.3 వేల వరకు ధర పలుకుతోందని పలువురు అంటున్నారు.
Similar News
News February 15, 2025
పాలకొల్లులో సందడి చేసిన జబర్దస్త్ అప్పారావు

జబర్దస్త్ నటుడు అప్పారావు శనివారం పాలకొల్లులో ఓ వివాహ వేడుకకు హాజరై సందడి చేశారు. జబర్దస్త్, పలు నాటికలతో ఆయన ప్రేక్షకులకు సుపరిచితులు. వరుడి తండ్రి తన స్నేహితుడు కావడంతో ఈ వివాహానికి హాజరైనట్లు అప్పారావు తెలిపారు. ఆయన రాకతో వివాహ వేడుకలో సందడి నెలకొంది. పలువురు సెల్ఫీలు దిగారు.
News February 15, 2025
ప.గో : బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. రోడ్డున పడ్డ కూలీలు

ప.గో జిల్లాలో బర్డ్ ఫ్లూ విజృంభించి కోళ్ల యజమానులకు తీవ్ర నష్టం వాటిల్లుతోన్న విషయం తెలిసిందే. అయితే ముఖ్యంగా జిల్లాలో తణుకులోని వేల్పూరు, ఉంగుటూరులోని బాదంపూడి, పెరవలిలోని కానూరు అగ్రహారం గ్రామాల్లో బర్డ్ ఫ్లూ తీవ్రత అధికంగా చూపింది. దీంతో సుమారు 40 ఫారాలు మూతలు పడగా.. పొట్టకూటికి వచ్చిన 3200 మంది కూలీలు ఉపాధి కోల్పోయి కుటుంబ పోషణ కష్టతరం కానుంది.
News February 15, 2025
దడ పుట్టిస్తున్న ‘జీబీఎస్’

గులియన్ బారే సిండ్రోమ్ ఉమ్మడి గోదావరి జిల్లాలను తాకింది. ఇప్పటివరకు కాకినాడ GGHలో 16 కేసులు, రాజమండ్రి GGHలో ఓ కేసు నమోదైంది. ప.గోకు చెందిన వ్యక్తి ప్రస్తుతం కాకినాడలో చికిత్స పొందుతున్నారు. అయితే భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. కాళ్లు, చేతులు తిమ్మిర్లు, కండరాల నొప్పులు ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలంటున్నారు. వ్యాధి ముదిరిన దశలో అవయవాలు చచ్చుబడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.