News November 21, 2024

ప.గో జిల్లాలో దొంగతనాలు..అరెస్ట్ చేస్తారని సూసైడ్

image

అరెస్ట్ భయంతో తిరుపతిలో సూర్యప్రభాశ్(20) ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం జరిగింది. ఇతను ప.గో, ఏలూరులో దొంగతనాలు చేసి కేసులు నమోదవ్వగా తిరుపతికి పారిపోయాడు. లక్కవరం ఎస్సై రామకృష్ణ, జంగారెడ్డిగూడెం క్రైం ఏఎస్సై సంపత్ కుమార్ సిబ్బందితో తిరుపతికి వెళ్లారు. పోలీసులను గమనించి అతను గడియ పెట్టుకొని..అరెస్ట్ చేస్తారనే భయంతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. రుయాకు తరలిస్తుండగా మృతి చెందాడు.

Similar News

News December 4, 2025

రూ.14,00 కోట్లతో తాగునీటి ప్రాజెక్టు: కలెక్టర్

image

జిల్లాలో స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు రూ.1,400 కోట్ల వ్యయంతో ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం తెలిపారు. 16 మండలాల పరిధిలోని 862 గ్రామాల్లోని 13.25 లక్షల కుటుంబాలకు తాగునీరు అందించేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. దీని కోసం 2,662 కిలోమీటర్ల మేర పైపులైన్ వేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.

News December 4, 2025

పాలకోడేరు: పిల్లలను ఎత్తుకుని ముద్దాడిన కలెక్టర్

image

పాలకోడేరు మండలంలోని విస్సాకోడేరులో ఉన్న శిశు గృహ సంరక్షణ కేంద్రాన్ని కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె శిశు గృహ సంరక్షణలో ఉన్న పిల్లలను ఎత్తుకుని ముద్దాడారు. కేంద్రంలో ఎంతమంది పిల్లలు ఉన్నారు, దత్తత ప్రక్రియ ఎంతవరకు వచ్చింది తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పిల్లలను శ్రద్ధగా చూడాలని ఈ సందర్భంగా ఆమె అధికారులకు సూచించారు.

News December 4, 2025

జలజీవన్ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ నాగరాణి

image

జిల్లాలో జలజీవన్ మిషన్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు సంబంధిత శాఖలు సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో తాగునీటి సరఫరా ప్రాజెక్టు ఏర్పాటు పనులపై సంబంధిత శాఖలతో ఆమె సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు ప్రస్తుత స్థితిగతులను, పురోగతిని గుత్తేదారు సంస్థ ప్రతినిధి, మేఘా కంపెనీ డీజీఎం వాసు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమావేశంలో వివరించారు.